ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ జడ్జ్ నియామకాలు, 39 పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం

andhra-high-court-senior-judge-appointments-opportunity-to-apply-for-39-posts

Telugu Mirror : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ జడ్జ్ (Andhra Pradesh High Court Senior Judge )నియామకాలను ప్రారంభించింది, జూనియర్ డివిజన్ కి సంబంధించి 32 మంది డైరెక్ట్ అభ్యర్థులుతో పాటు, ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మరో 7 మందినీ రిక్రూట్ చేసుకోనున్నది, అదేవిధంగా ఈ పోస్టులు పెర్మనెంట్ పోస్టులు అని కూడా హైకోర్టు తెలియజేసింది, ఈ పోస్టులకు తగిన అభ్యర్థులు మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ కి వెళ్లి ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు, ఈ పోస్ట్ కి కావాల్సిన విద్యా అర్హత మరియు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రిక్రూమెంట్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు ఏంటంటే ఈ నియమకాలు హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ (High Court of Andhra Pradesh Organization) పేరు కింద వస్తాయి, ఈ ఆర్గనైజేషన్ అధికారిక వెబ్సైటు వచ్చేసి www.aphc.gov.in, మొత్తం 39 పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆన్లైన్ సబ్మిషన్ చివరి తేది 01-03-2024 వరకు ఉంటుంది.

సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) : 

  • జాబ్ లొకేషన్ : అమరావతి, గుంటూరు, 522202 ఆంధ్రప్రదేశ్
  • చివరి తేదీ : మార్చి 1, 2024
  • జాబ్ టైప్ : ఫుల్ టైం
  • 39 ఓపెన్ సీట్స్ ఉన్నాయి.
andhra-high-court-senior-judge-appointments-opportunity-to-apply-for-39-posts
Image Credit : Studycafe

Also Read : Motorola G34 5G : ఫ్లిప్కార్ట్ ద్వారా మోటోరోలా G34 5G సేల్ ఈరోజు ప్రారంభం : ధర, స్పెసిఫికేషన్స్ ఇప్పుడే తనిఖీ చేయండి

అర్హత ప్రమాణాలు మరియు ఎంపిక విధానం : 

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డైరెక్టర్ మరియు ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ కోసం భారతదేశంలోని ఏ లా యూనివర్సిటీ (University of Law) నుంచి అయినా లా డిగ్రీ పొంది ఉండాలి.

ఇంకా సివిల్ జడ్జ్ జీతం విషయానికి వస్తే 77,840 నుంచి 1,36,520 వరకు ఉంటుంది.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు 35 స్వంచర్ల వయసు ఉండాలి, ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు 48 స్వంచర్ల వయసు ఉండాలి,

కంప్యూటర్ టెస్ట్, రిట్టెన్ టెస్ట్, వైవ టెస్ట్, రాసిన తరువాత వాటి ఫలితాలను అధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిట్టెన్ టెస్ట్ 100 మార్కులు, వైవ టెస్ట్ 50 మార్కులు

ఎగ్జామినేషన్ ఫీజ్ వివరాలు వచ్చేసి OC/ EWS/ BC కేటగిరీ వారికి రూ.1500, ఎస్సీ , ఏపీ ఎస్సీ, ఎస్టీలు, పిహెచ్ లకు రూ.750

అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక మరియు ఆన్లైన్ పేమెంట్ అయిపోయాక కన్ఫర్మేషన్ స్లీప్ ని ప్రింట్ తీసుకోవటం మర్చిపోకండి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in