Telugu Mirror : iQoo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. iQoo Z9 5G మార్చి 12న భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ప్రారంభానికి ముందు, కంపెనీ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాసెసర్, కెమెరా, డిస్‌ప్లే మరియు బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. అదే విదంగా స్మార్ట్‌ఫోన్ ధర, ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్‌లను వెల్లడించింది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, iQoo Z9 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7200 SoC ప్రాసెసర్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1800nits బ్రైట్ నెస్ మరియు 300Hz టచ్ శాంప్లింగ్ రేటుతో AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రాఫేన్ బ్లూ మరియు బ్రష్డ్ గ్రీన్ రెండు రంగులలో అందుబాటులోకి రానుంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్విన్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి.
iQoo Z9 స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు 7.83mm మందంతో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ మరియు 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ముకుల్ శర్మ అనే X వినియోగదారుడు మాట్లాడుతూ, రాబోయే స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB మరియు 8GB + 256GB మోడళ్లలో అందుబాటులో ఉంటుందని, దీని ధర రూ. 17,999 మరియు రూ. 19,999 ఉంటుంది అని తెలిపాడు. iQoo Z9 5G iQoo కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్ రెండింటిలో నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు మార్చి 13, 12PM IST లో స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి ముందస్తు యాక్సెస్‌ను కలిగి ఉంటారని, మిగతా వారందరకి మార్చి 14, 12PM ISTన ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది అని కంపెనీ తెలిపింది. iQoo Z9 5G స్మార్ట్‌ఫోన్ ఆసక్తిగల కొనుగోలుదారులకి తమ ICICI బ్యాంక్ లేదా HDFC బ్యాంక్ కార్డ్‌ల ద్వారా తక్షణ రూ. 2000 వరకు తగ్గింపును పొందవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…