AP Inter Marks Memoes In Website
AP Inter Marks Memoes In Website : ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం జరిగిన ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలకు సంబంధించిన మార్కుల మెమోల్ని కూడా ఈరోజు బోర్డు అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మార్కుల మెమో లను ప్రింట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల అనంతరం వారికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కుల మెమోల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లో మార్కుల మెమోలను (Marks Memoes On Website) అప్ లోడ్ చేశారు. వెబ్ సైట్ లోని మెమో లను పొందేందుకు వీలుగా పలు సూచనలు కూడా చేసినారు. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://bieap.apcfss.in/ లోకి వెళ్లి మార్కుల మెమోలు డౌన్ లోడ్ చేసుకునేలా వీలు కల్పించారు. ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ లోకి వెళ్ళి అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే మార్కుల మెమోలు డౌన్ లోడ్ అవుతాయి. డౌన్ లోడ్ అయిన మార్కుల మెమోలను ప్రింట్ తీసుకోవచ్చు.
AP Inter Supplementary Exam Fee Last Date :
ఇదిలా ఉండగా ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఫెయిల్ అయిన విధ్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా మార్కుల ఇంప్రూవ్ మెంట్ కావాలనుకునే విధ్యార్ధులు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి అనగా ఏప్రిల్ 18, 2024 నుంచి ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకునే అభ్యర్ధులు ఏప్రిల్ 24వ తేదీ వరకూ ఫీజులు చెల్లించవచ్చు. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీ కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం కూడా ఫీజును చెల్లించవచ్చు. రీ వెరిఫికేషన్ కావాలనుకునే వారు ఒక్కో జవాబు పత్రానికి రూ.1300 చొప్పున చెల్లించాలి. రీకౌంటింగ్‌కు వెళ్లాలనుకునే వారు ఒక్కో పేపర్ కు రూ. 260 చెల్లించాలి. సప్లిమెంటరీ ఫీజు రూ. 550 గా నిర్ణయించారు, కనుక సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే ప్రతి విధ్యార్ధి రూ. 550 ఫీజు చెల్లించాలి. ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన వారికి పరీక్ష ఫీజుగా రూ.250, సప్లిమెంటరీ బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాలి.