AP Pensions : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సాధించింది. టీడీపీ కూటమి 164 స్థానాల్లో బలమైన మెజారిటీ సాధించింది. దీంతో ప్రతిపక్షం లేకుండా తిరుగులేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే, టీడీపీ చెప్పిన హామీలను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో పింఛన్లు (Pensions) పెంపుదల ఒకటి. అయితే, ఈ హామీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? ఎన్నికల సమయంలో టీడీపీ (TDP) కూటమి తరపున చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. పింఛను పెంచడం ఇందులో ఒక భాగం. గతంలో వైసీపీ పాలనలో నెలవారీ పింఛను రూ.3వేలు మంజూరు చేయగా, దానిని రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.
పింఛను పెంపు ఏప్రిల్‌లో అమల్లోకి వస్తుందని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఏప్రిల్‌లో దీన్ని అమలు చేసి జులైలో బకాయిలతో కలిపి మొత్తం రూ.7 వేల పింఛను పంపిణీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దాని అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సమాచారం.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నెలవారీ పింఛన్‌ను 4 వేలకు పెంచుతామని తాజగా హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలోనూ పింఛన్‌ను 2 వేల నుంచి 3 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చినా ప్రజలు నమ్మలేదు. మూడు వేలు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే గెలుపొందిన తర్వాత దాన్ని మూడు వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారం ప్రతి ఏటా 250 చొప్పున పెంచాలని నిర్ణయించగా, మధ్యలో ఒక సంవత్సరం కాకుండా ఐదేళ్ల పాలన పూర్తికాగానే 3 వేలకు పెంచారు.
మళ్లీ అధికారంలోకి వస్తే 4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ లేదా జూలైలో పెరిగిన రూ.1000 పింఛను, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి రూ.3వేలు, జూలైలో ఇవ్వాల్సిన రూ.4వేలకు కలిపి మొత్తం రూ.7,000 ఇస్తామని చెప్పారు.