AP Polycet 2024 : 10వ తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ విద్యాసంస్థల్లో ఏటా నిర్వహించే పాలీసెట్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేశారు. పాలీసెట్ 2024 పరీక్ష కోసం దరఖాస్తులు ఇప్పటికే ముగించారు. అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఈరోజు హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ హాల్‌టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పాలీసెట్ 2024 హాల్‌టికెట్లు ఈరోజు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వచ్చాయి. పాలిసెట్ అధికారిక వెబ్సైట్ https://polycetap.nic.in/ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవవచ్చు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా ఈ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీపించుకోవాలి.
ఏపీలో పాలీసెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 27న జరగనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పాలిసెట్ అధికారిక వెబ్సైట్లో తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవవాలి. అవసరమైన సమాచారాన్ని అందించి, హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్లు ఉంటే, హెల్ప్ డెస్క్ నంబర్ మరియు ఇతర సమాచారం వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటుంది.
AP పాలిసెట్ 2024 హాల్ టిక్కెట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- AP పాలిసెట్ హాల్ టికెట్ 2024 అధికారిక వెబ్సైట్ http://polycet.ap.nic.inకి వెళ్ళాలి.
- ‘ప్రింట్ హాల్ టికెట్’ లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థి పోర్టల్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత పరీక్ష, 10వ తరగతి హాల్ టికెట్ నెం., అభ్యర్థి పుట్టిన తేదీ, 10వ తరగతి ఉతీర్ణత, హాజరైన సంవత్సరం వివరాలను ఎంచుకోవాలి/నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు, ‘వ్యూ అండ్ ప్రింట్ హాల్ టిక్కెట్’ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు వారి AP పాలీసెట్ 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP పాలిసెట్ హాల్ టిక్కెట్ల వివరాలు 2024
అభ్యర్థులు తమ AP పాలీసెట్ 2024 హాల్ టిక్కెట్లో ఈ వివరాలు ఉంటాయి.
- అభ్యర్థి పేరు మరియు వారి తల్లిదండ్రుల గురించి సమాచారం ఉంటుంది.
- AP పాలీసెట్ 2024 పరీక్ష హాల్ టిక్కెట్ నెంబర్
- ఎగ్జామ్ సెంటర్ అడ్రస్
- AP పాలిసెట్ 2024 పరీక్ష తేదీ మరియు సమయం.
- అభ్యర్థులకు పరీక్ష సూచనల ఉంటాయి.