AP Summer Holidays : ఏపీ ప్రభుత్వం తాజాగా స్కూల్ పిల్లలకు సెలవులను ప్రకటించింది. తాజాగా, ఏపీలో పది మరియు ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిశాయి. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఏ పాఠశాలలు అయితే పరీక్ష కేంద్రాలుగా పని చేశాయో ఆ పాఠశాలల్లో మిగిలిన తరగతులకు సెలవులు ప్రకటించారు.
వేసవి సెలవులు ఎప్పటి నుండి అంటే..?
అయితే, మరి ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పటి నుండి ఇస్తారు? అనే విషయంపై తాజాగా ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అన్ని తరగతులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే పిల్లలకు సెలవులు ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల తేదీలు ఎప్పటి నుండి అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
జూన్ 12 వరకు సెలవులు..!
యాన్వల్ ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలందరికీ వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు ప్రకటించారు. అంటే మళ్ళీ జూన్ 12 వ తేదీన పాఠశాలలు రీఓపెన్ అవుతాయి. మొత్తం దాదాపు 50 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా సెలవులు అలాగే ఉన్నాయి.
SA-2 పరీక్షలు ఎప్పటి నుంచంటే?
AP విద్యార్థులు తమ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-2 పరీక్షలను ఏప్రిల్ 6న ప్రారంభించనున్నారు. పాఠశాల విద్యా శాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పరీక్షలు జరుగుతాయి. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు ఎదురైతే షెడ్యూల్‌ను మారుస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
టైమ్‌టేబుల్
- 1 నుండి 5 తరగతులకు ఏప్రిల్ 6 నుండి 16 వరకు పరీక్షలు జరుగుతాయి.
- 6 నుండి 8 తరగతులకు పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 18 వరకు జరుగుతాయి.
- కాంపోజిట్ కోర్సు విద్యార్థులకు ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుంది. 8వ మరియు 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1 మరియు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి, 6 మరియు 7 తరగతులకు ఒక పేపర్ మాత్రమే పరీక్ష జరుగుతుంది.
రోజు రోజుకి పెరుగుతున్న ఎండలు
ఎండలు, వేడి గాలులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సెలవులు ఇవ్వగానే తల్లిదండ్రులు పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించండి.