ap summer school programme: వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఒంటి పూట బడులు కూడా పూర్తి కావొచ్చాయి. ఏపీ ఇంటర్, పది పరీక్షలు ముగిసి ఇప్పటికే మూల్యాకనం పూర్తయి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల పిల్లలకు ఎస్ఏ – 2 ఎగ్జామ్స్ ముగుస్తున్నాయి. రేపటి నుండి వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలు అందరూ సెలవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలు ఎండకి తట్టుకోలేపోతున్నారు.
సెలవులు ఇస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ను ఇచ్చింది. మరి ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? విద్యారుల కోసం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూన్ 12 వరకు సెలవులు..!
యాన్వల్ ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలందరికీ వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు ప్రకటించారు. అంటే మళ్ళీ జూన్ 12 వ తేదీన పాఠశాలలు రీఓపెన్ అవుతాయి. మొత్తం దాదాపు 50 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా సెలవులు అలాగే ఉన్నాయి.
సరదాగా సెలవుల్లో – 2024 కార్యక్రమం
విద్యార్థులు తమ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు AP విద్యా శాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయమై పాఠశాలలకు కీలక ఆదేశాలు పంపారు. విద్యా శాఖ సరదాగా సెలవుల్లో- 2024 అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోచింగ్ క్యాంపులను నిర్వహించే బాధ్యతను పీఈటీలకు అప్పగించారు. అలాగే ఉపాధ్యాయులు పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తూ.. లవ్ రీడింగ్ పేరుతో పోటీలు నిర్వహించాలని సూచించారు.
సరదాగా సెలవుల్లో కార్యక్రమం అమలుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ శుక్రవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా, ప్రతి తరగతిలో వారి విభాగాలకు తగ్గట్టుగా మార్గదర్శకాలను విడుదల చేశారు. సరదాగా సెలవుల్లో అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలతో పాటు తమలో దాగి ఉన్న నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, స్థానిక ప్రజాసంఘాలు ఇందులో భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరింది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…