APPSC Group 1 Prelims Hall Tickets Download: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు రేపే విడుదల, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు. అభ్యర్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్లను https://portal-psc.ap.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

APPSC Group 1 Prelims Hall Tickets Download: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 10వ తేదీ అంటే రేపు  డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ తెలిపారు. గతంలో ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పరీక్ష జరగనుంది.

ఆ రోజు, ఉదయం 10 గంటల నుండి  మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం  2 గంటల నుంచి సాయంత్రం 4వరకు పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.కనీసం ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను వెరిఫై చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరు కాగలుగుతారు. అభ్యర్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్లను https://portal-psc.ap.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP గ్రూప్ 1 హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి : 

  • APPSC అధికారిక వెబ్‌సైట్, https://portal-psc.ap.gov.in/ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో, APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ హాల్ టికెట్‌పై క్లిక్ చేయండి.
  • మీ సమాచారాన్ని నమోదు చేసి,సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ ను చూడవచ్చు.
  • ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఎంపిక చేసి మీ హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ప్రిలిమినరీ పరీక్ష (AP గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024) స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 240 మార్కులతో ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది. పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మారులకు 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ కు  2 గంటలు సమయం ఉంటుంది. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ), రాజ్యాంగం, రాజకీయాలు, సామాజిక న్యాయం మరియు అంతర్జాతీయ సంబంధాలు (పార్ట్-బి), ఏపీ, ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్ (పార్ట్-సి), జాగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ) ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు.

ప్రధాన రాత పరీక్షలో ఐదు పేపర్లు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు భాషా పేపర్లు కూడా ఉంటాయి. అయితే, వీటిని అర్హత పరీక్షలుగా పరిగణిస్తారు. ప్రధాన రాత పరీక్షలో 750 మార్కులు ఉంటాయి, ప్రతి ఐదు పేపర్‌లకు 150 మార్కులు కేటాయిస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

ఖాళీల వివరాల గురించి తెలుసుకుందాం..

  • డిప్యూటీ కలెక్టర్ పోస్టులు: 9
  • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ టాక్సేషన్-18
  • DSP (సివిల్)- 26
  • ప్రాంతీయ రవాణా అధికారి-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 5
  • జిల్లా ఉపాధి అధికారి – 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి-3
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్: 3
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్: 1
  • జిల్లా బీసీ సంక్షేమ అధికారి-1
  • మున్సిపల్ కమిషనర్, గ్రేడ్ II-1
  • ఎక్సైజ్ సూపరింటెండెంట్: 1

APPSC Group 1 Prelims Hall Tickets Download

 

 

 

Comments are closed.