Araku Trip By Telangana Government: సరసమైన ధరలో అరకు ట్రిప్, ప్యాకేజీ వివరాలు ఇవే..!
అరకు టూర్ - తెలంగాణ టూరిజం పేరుతో ప్యాకేజీ ఉంటుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి వంటి ప్రాంతాలను సందర్శిస్తారు.
Araku Trip By Telangana Government: అత్యంత సరసమైన ధరలో అరకును సందర్శించేందుకు తెలంగాణ పర్యాటక ప్యాకేజీని ప్రారంభించింది. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. హైదరాబాద్ – అరకు ప్రయాణ ప్యాకేజీ ధర రూ.6999 ఉంది. ఈ ప్యాకేజీ అరకు టూర్ – తెలంగాణ టూరిజం (Telangana Tourism) పేరుతో అందిస్తారు. ఈ టూర్ నాలుగు రోజులు ఉంటుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి తదితర ఆకర్షణలను సందర్శిస్తారు. ఈ టూర్ ప్రతి బుధవారం తేదీల్లో ప్రారంభం అవుతుంది.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) లోని టూరిగ భవన్‌లో యాత్ర ప్రారంభం కానుంది. రెండవ రోజు, ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, రుషికొండ ప్రాంతాలను సందర్శిస్తారు. అంతేకాకుండా. సాయంత్రం సబ్ మెరైన్ మ్యూజియం (Sub Mariane Museum) మరియు వైజాగ్ బీచ్ (Vizag Beach) ను సందర్శించవచ్చు. రాత్రికి వైజాగ్‌లో బస చేస్తారు.
Also Read:Hyderabad-Vijayawada Flyover : హమ్మయ్య, అక్కడ ఫ్లెఓవర్ నిర్మాణం, వాహనదారులకు బిగ్ రిలీఫ్..!
ఉదయం 6 గంటలకు బ్రేక్ ఫాస్ట్ (Break Fast) చేస్తారు. ఈ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు అరకు సందర్శిస్తే, మీరు గిరిజన మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, బొర్రకావ్స్ మరియు ధిస్మా నృత్యాన్ని చూడవచ్చు. ఇక ఆ రాత్రిపూట అరకులోనే ఉంటారు.
నాలుగో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనానంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుంది. ప్రయాణ ప్యాకేజీ ఐదవ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ముగుస్తుంది. ప్రయాణం ఏసీ లేని బస్సులో ఉంటుంది. టిక్కెట్ ధరలను చేసుకోండి. పెద్దలకు రూ.6,999, పిల్లలు రూ.5.599 చెల్లించాలి. మరింత సమాచారం కోసం లేదా ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి https://tourism.telangana.gov.in/package/ArakuTour ని సందర్శించండి.
Comments are closed.