Telugu Mirror: సినీ కథకులను మించిన పరిజ్ఞానం కలిగిన ప్రేక్షకులు ఉంటారు. ఇప్పుడైతే ఇంకా మరీ నెటిజన్లకు ఏ కొంచెం చిన్న క్లూ దొరికేసిన హీరో హీరోయిన్ల మధ్య ఉన్న బంధం ఏంటో కూడా కనిపెట్టేస్తున్నారు. నెటిజన్లకు మేము ఏమాత్రం తీసిపోము అని సెలబ్రిటీలు చేసే పోస్ట్ లు కూడా నెటిజన్లకు అనుమానం తెప్పించేలా ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత వేరువేరుగా పోస్ట్ చేసిన ఫొటోలు సమ్‍థింగ్ ఫిషీ అన్నట్లుగా ఉన్నాయి.
విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి (Kushi 2023). లేటెస్ట్ గా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న అంటే శుక్రవారం నాడు విడుదలైంది. అయితే ఖుషి సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ స్టోరీ, గెస్ చేసే సీన్స్, కొంత ల్యాగ్ ఉన్నాగానీ టోటల్ గా సినిమా కుటుంబ కథా చిత్రం లా ఉందని రివ్యూలు వస్తున్నాయి. సినిమాపై పాజిటివ్ టాక్ (Positive Talk) రావడంతో ఎంతోకాలంగా హిట్ కోసం పడిగాపులు పడుతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు సక్సెస్ వచ్చినట్లే అని అంటున్నారు.
మరోపక్క శాకుంతలం వంటి ఫెయిల్యూర్ చిత్రం తర్వాత సమంత, టక్ జగదీష్ ప్లాప్ అనంతరం డైరెక్టర్ శివ నిర్వాణకు (Shiva Nirvana) ఖుషి మూవీ రూపంలో హిట్ లభించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఖుషి సినిమా ప్రమోషన్లను కూడా కొత్తదనంతో, జోరుగా చేస్తూ వచ్చింది . ఖుషి సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన మ్యూజికల్ కాన్సెర్ట్ లో స్టేజీ మీద సామ్, విజయ్ చేసిన డ్యాన్స్ వీడియో విపరీతమైన వైరల్ అవడంతో పాటు. మీమ్స్ తో ట్రెండ్ అయింది. తాజాగా ఖుషి మూవీ నేడు విడుదల అవుతుండగా విజయ్ దేవరకొండ నిన్న రాత్రి ఓ వీడియోతో ప్రమోషన్ చేశాడు.
View this post on Instagram
గుర్తుతెలియని ప్రాంతంలో ఓ స్విమ్మింగ్ పూల్‍లో ఉండి , విజయ్ దేవరకొండ ఖుషి సినిమా రిలీజ్, రెస్పాన్స్ గురించి ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. అయితే గురువారం రాత్రి సమంత కొన్ని ఫొటోలు తన ఇన్ స్టా లో షేర్ చేసింది. సమంత (samantha)షేర్ చేసిన ఫోటోలలో ఒక ఫోటోలో సమంత స్విమ్మింగ్ పూల్‍లో ఉంది. సమంత, విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఓకేలా ఉండటంతో, నెటిజన్లు సమంత , విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. సమంత ఫొటోకు కెమెరా మెన్ విజయ్ దేవరకొండనా అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
సమంత మాత్రం ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంది. ఆమె షేర్ చేసిన పోస్టులో ఆమె ఉన్న ప్రాంతం క్లియర్‍గా ఉండటంతోపాటు కొద్దిగా వెలుతురు కలిగి ఉదయంలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఫోటోలోని లొకేషన్ ఎక్కడనేది మాత్రం స్పష్టంగా లేదు. కానీ, విజయ్ షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ వీడియోలో చీకటిలా ఉంది. ఇద్దరూ ఒకే స్విమ్మింగ్ పూల్‍లో లేని విధంగానే కనిపిస్తున్నా. నెటిజన్లు మాత్రం ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ వీడియో, సమంత ఫొటోలు నెట్టింట్లో ఖుషీగా వైరల్ అవుతున్నాయి.