White Hair : తెల్ల జుట్టు సమస్య తో బాధపడుతున్నారా ?నల్లని,దట్టమైన కేశాలకు బలం చేకూరాలంటే ఈ నాచురల్ టిప్స్ పాటించాల్సిందే..
Telugu Mirror : నేటి కాలంలో కలుషితమైన ఆహారం(Food) మరియు జీవన విధానంలో అస్తవ్యస్త మార్పులు వల్ల శరీరంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు వల్ల చర్మంపై కూడా వివిధ రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అలాగే యువతలో మరియు కొంతమందికి బాల్యం నుంచే తెల్ల జుట్టు(White Hair) రావడం అనే సమస్య ఆరంభం అవుతుంది. తెల్ల జుట్టు ఉండడం వల్ల చాలామంది అభద్రతా భావానికి లోనవుతారు. ఈ వైట్ హెయిర్ ఉన్నవాళ్లు బయటికి వెళ్లడానికి కూడా సిగ్గుగా భావిస్తారు. వైట్ హెయిర్ బ్లాక్(Black) గా మార్చడం కోసం చాలామంది హెయిర్ డై లు వాడుతుంటారు.
వీటిలో రసాయనాలు ఉండటం వల్ల జుట్టును పాడు చేస్తాయి. మరి కొంతమంది హెయిర్ సెలూన్ కి వెళ్లి మరీ వేల రూపాయలు ఖర్చుపెట్టి హెయిర్ డై లు వేయించుకుంటూ ఉంటారు.ఈరోజు మనం ఇంట్లోనే సహజ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
దీనికోసం కొబ్బరినూనె మరియు ఉసిరికాయల పొడి(Amla powder) కావాలి. ఉసిరికాయలు మరియు కొబ్బరినూనె జుట్టుకు ఉపయోగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటి కలయికతో తెల్ల జుట్టు నల్లగా మార్చవచ్చు.
దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నె(Bowl)లో మూడు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల ఉసిరికాయ పొడిని వేసి కలపాలి. ఉసిరి పొడిని నూనెలో ఇంకిపోయే వరకు నూనెను సన్నని మంట మీద మరిగించండి. స్టవ్ ఆఫ్ చేసి నూనెను పక్కన ఉంచండి. గోరువెచ్చగా అయ్యాక జుట్టుకు మర్దన చేస్తూ ఈ నూనె రాయండి. ఉసిరి(Amla)లో ఉండే లక్షణాల వలన తెల్ల జుట్టును నల్లబరచడానికి బాగా తోడ్పడుతుంది. దీని తరచుగా వాడటం వలన వైట్ హెయిర్ నుండి బయట పడవచ్చు.
చాలా మంది తెల్ల వెంట్రుకలను కవర్ చేయడానికి గోరింటాకును పెడుతుంటారు. ఈ గోరింటాకు తల పైన ఉన్న జుట్టును మాత్రమే రంగు మారేలా చేస్తుంది. అయితే మీరు తెల్ల జుట్టును మూలాల నుండి జుట్టు రంగును నల్లగా చేయాలంటే ఈ విధంగా చేయండి.ఒక గిన్నెలో మూడు నుంచి నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె(Coconut Oil) వేయాలి. కొన్ని గోరింటాకులు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై నూనె మరిగించండి. నూనె యొక్క రంగు బ్రౌన్ కలర్ లోకి మారుతుంది.
Back Pain : స్థిరమైన నడుము నొప్పి క్యాన్సర్ కు దారి తీస్తుందా? వైద్య నిపుణుల మాట ఏమిటి మరి?
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనె పక్కకు ఉంచండి. గోరువెచ్చగా అయ్యాక ఈ నూనెను జుట్టు మొదళ్లనుండి చివరి వరకు అప్లై చేయాలి. ఈ నూనెను తరచుగా వాడటం వల్ల తెల్ల జుట్టు నల్లబడే అవకాశం ఉంది. కొన్ని రోజులు వాడిన తర్వాత తేడాను మీరే గమనిస్తారు. ఇది మీ జుట్టును లోపల నుండి నల్లగా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది.ఇది 100% నాచురల్ హోం రెమిడి(Home remedy).వీటివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీకు ఏది వీలుగా ఉంటుందో దానిని ప్రయత్నించండి. తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడండి.