బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ వాడుతున్నారా ?అయితే ఈ విషయాలు తెలుసుకోండి
లాప్ టాప్ అలాగే మొబైల్ ఉపయోగించే వారు బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ వాడుతుంటారు. అయితే వాటినుండి వచ్చే బ్లూ రేస్ కళ్ళ సమస్యలతో పాటు ఇతర సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా వస్తాయి . కనుక వాటి ప్రయోజనాలు తెలుసుకొని ఉపయోగించాలి .
లాప్ టాప్ (Laptop) మరియు మొబైల్ (Mobile) ఉపయోగించడం ప్రస్తుత కాలంలో అధికమైంది. అయితే వీటిని అధికంగా వాడటం వల్ల కళ్లకు హానికరమని అందరూ భావిస్తారు. నిజానికి వాటి నుండి వెలువడే నీలి కాంతి కిరణాలు(Blue-Rays) కళ్ళ సమస్యలను పెంచడంతోపాటు నిద్ర నాణ్యత మరియు శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇటువంటి దుష్ప్రభావాలను (Side Effects) నివారించడానికి కొందరు తరచుగా బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ ధరిస్తూ ఉంటారు. ఈ అద్దాలు స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతిని ఫిల్టర్ చేస్తాయని మరియు దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయని నమ్ముతారు. కానీ వీటిని వాడటం వల్ల నిజంగా ప్రయోజనకరమా? కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
ఇటీవల పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, ఈ వాదనను కొట్టి పారేశారు. కాబట్టి ఈ ప్రశ్న రేకెత్తింది. స్క్రీన్ పై పని చేసేటప్పుడు బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ ధరించినప్పటికీ అవి కళ్ళకు హాని తగ్గించడంలో అంత ప్రభావంతంగా పనిచేయడం లేదని పరిశోధకులు తెలిపారు. ఈ బ్లూ లైట్ గ్లాస్సెస్ (Blue light glasses)డ్యామేజ్ మరియు నిద్ర సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరంగా లేవని పరిశోధకులు అంటున్నారు. బాగా ఎక్కువగా నీలికాంతి కిరణాలకు గురి అయ్యే వ్యక్తులలో కళ్ళ మీద ఒత్తిడి మరియు కళ్ళు పొడి బారడం (Dry)వంటి కంటి సమస్యలు వస్తాయి. బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ ఈ సమస్యలను తగ్గిస్తాయని భావిస్తారు. అయితే అధ్యయనాలలో వీటిని ధరించడం వల్ల అంత ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొనలేదు.
Also Read :శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల సమస్యా? పరిష్కరించండి ఇలా.
కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం, డబ్బు మితం పోషణ అమితం.
హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేపించుకోవాలని అనుకుంటున్నారా, పూర్తి అవగాహన తెచ్చుకోండిలా
కోక్రాన్ డేటా బేస్ ఆఫ్ సిస్టమాటిక్ రివ్యూస్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ,ఆరు దేశాలలో 17 క్లినికల్ ట్రైల్స్ నుండి 619 మందిని సేకరించి వారి డేటాను పరిశీలించింది. ఈ బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ స్క్రీన్ చూడటం వల్ల వచ్చే అలసటను నివారించడంలో ప్రయోజనకరంగా లేదని తేలింది. బ్లూ లైట్ వల్ల కళ్ళు దెబ్బతిన్నాయని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో ఆప్టోమెట్రీ మరియు విజన్ శాస్త్రవేత్త, సీనియర్ రచయిత లారా డౌనీ చెప్పారు.
కోవిడ్ -19 (Covid-19)సమయంలో లాప్ టాప్ (Laptop) మరియు మొబైల్ వ వాడకం అధికం అవ్వడం వల్ల బ్లూ లైట్ కి సంబంధించిన అనేక సమస్యలు ప్రజలలో ఎక్కువగా వస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ ధరించడం వల్ల అవి అంత ప్రయోజనకరంగా లేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు .ఈ లెన్స్ వల్ల దృష్టి నాణ్యత పై చెడు ప్రభావం చూపిస్తాయా లేదా ఇతర సమస్యలు వచ్చేలా చేస్తాయా అనే విషయం కూడా స్పష్టత లేదు. బ్లూ లైట్ గ్లాస్సెస్ దీర్ఘకాలికంగా వాడటం వలన రెటీనా (Retina) ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే విషయం కూడా తెలియదు.
కంప్యూటర్ స్క్రీన్ లు మరియు ఇతర కృత్రిమ వనరుల నుండి వెలువడే నీలి కాంతికిరణాలు మొత్తం, పగటి పూట వెలువడే నీలి కాంతి కిరణాలలో వెయ్యి వంతు మాత్రమే అని పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి అటువంటి సందర్భంలో కళ్లద్దాలు అవసరం ఉండదు. బ్లూ లైట్ లెన్స్ లో సాధారణంగా 10% నుండి 25% నీలి కాంతిని మాత్రమే ఫిల్టర్ చేస్తాయని కనుగొన్నారు.
స్క్రీన్ లను వాడే ప్రతి ఒక్కరు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పగటిపూట కంప్యూటర్ లేదా మరేదైనా స్క్రీన్ లను అధికంగా ఉపయోగిస్తే వాటి వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి కళ్ళను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు 20- 20 -20 టెక్నిక్ ను పాటించవచ్చు అని చెప్పారు. ఈ టెక్నిక్ (Technic) ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉంచిన వస్తువును చూడాలని సూచించారు. ఇలా చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయని అన్నారు. అయితే కళ్ళను మరింత ఆరోగ్యంగా ఉంచడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలి అని కూడా అన్నారు.