Telugu Mirror : కొంతమంది పిల్లలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. మరి కొంతమంది పిల్లలు సహజంగానే సిగ్గుపడుతూ సమాజంలో కలవకుండా ఒంటరిగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు లాప్ టాప్(Laptop) మరియు మొబైల్ లను వారి ప్రపంచంగా భావిస్తున్నారు. మొబైల్ చూడడం ద్వారా ప్రపంచం మొత్తంతో సామాజికంగా ఉన్నామని భావిస్తున్నారు. పిల్లలు స్నేహితులతో కలవకపోవడం అలాగే సామాజికంగా ఉండటం కష్టంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది.
చదువు, క్రీడలతో పాటు పిల్లలకు సామాజిక విలువలను అందించాలి. మౌనంగా ఉండటం, ఒంటరిగా ఉండటం వలన వారి అభివృద్ధి కుంటుపడుతుంది. సాంఘికీకరణ(Socialization) ద్వారా పెంచడం వల్ల వారిలో ప్రేరణ పెంపొందుతుంది. అలాగే ధైర్యాన్ని ఇస్తుంది .మరియు కొత్త విషయాలను నేర్చుకునే అవగాహన మరియు అవకాశాన్ని ఇస్తుంది. పిల్లలు మొబైల్(Mobile) జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అనుకుంటారు కానీ మొబైల్ కి వెలుపల కూడా ప్రపంచం ఉందని పిల్లలకి అర్థం అయ్యేలా వివరించి చెప్పాలి. ఆత్మగౌరవం కోసం సామాజిక సంబంధాలు చాలా ముఖ్యమైనవి. కొత్త వ్యక్తులతో కలవలేకపోవడం మరియు మాట్లాడలేకపోవడం పిల్లలకి ఇబ్బంది పడే అంశాలు కాబట్టి తల్లిదండ్రులు వారికి అర్థమయ్యేలా నేర్పించాలి.
చాలామంది పిల్లలు ఇప్పటికే సామాజికంగా జీవిస్తున్నారు. వీరు అందరితో కలిసి పోవడానికి ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోతారు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలకు ఒక గ్లాసు నీళ్లు తీసుకురమ్మని చెప్పి వాళ్లకి ఇవ్వమని చెప్పాలి. అలాగే ఇంటికి వచ్చిన వారిని పలకరించాలి అని నేర్పించాలి .మరియు సామాజిక కార్యకలాపాలలో పిల్లలను భాగస్వామ్యం చేయాలి. సాంఘికంగా పిల్లలను పెంచడం ద్వారా పిల్లలు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్నవారితో కలిసి పోయి వారితో ఆనందంగా ఉంటారు.
చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మరియు సన్నిహిత వ్యక్తులకు తప్ప మిగిలిన వారితో పెద్దగా సంబంధాలు ఉండవు. అటువంటి పిల్లలు అంతర్ముఖ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు బయటి ప్రపంచంలో కలవలేరు. ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఆక్టివ్ గా మరియు ఇంటరాక్టివ్ గా ఉండడం చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలను సమాజంలో కలిసే విధంగా పెంచాలి. దీని వలన వారిలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. తద్వారా ఒంటరితనం అనే భావన దూరమవుతుంది .స్నేహితులతో కలిసి సాంస్కృతిక ,అద్లెటిక్, వినోద కార్యక్రమాలలో పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలి.
About Sleep : ‘నిద్ర’ గురించి పూర్తి వివరణ, నిద్రలేమి సమస్యకు నివారణ తెలుసుకోండి ఇలా.
పిల్లల మనసు నిర్మలంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులు ఉండేలా చూసుకోవాలని చెప్పాలి. వారికి ఏదైనా సహాయం అవసరమైతే సహాయం చేసేలా పిల్లలకు నేర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో సహకార భావం మరియు సద్భావన పెరిగే అవకాశం ఉంటుంది .స్నేహానికి సంబంధించిన మరియు స్ఫూర్తిదాయకమైన కథలు(Inspirational stories) పిల్లలకు చెప్పాలి.పిల్లలు ఏదైనా కొత్త విషయం విన్నప్పుడు వారు ఆ విషయం గురించి ప్రశ్నించేలా ఉండాలి. అందులో ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ప్రశ్నించడం కూడా నేర్పించాలి. ప్రశ్నించకపోతే వారిలో అభివృద్ధి అనేది ఉండదు. ప్రశ్నించడం వలన వారిలో ఉత్సుకత మొదలవుతుంది. వారికి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది . సొంతంగా ఆలోచించే తత్వం వస్తుంది.పోటీలలో పాల్గొన టానికి ఇష్టపడతారు.
ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ(Talent) దాగి ఉంటుంది. అది వారి బలంగా గుర్తించాలి. తల్లిదండ్రులు వారికి వేటి మీద ఆసక్తి ఉందో తెలుసుకొని వారిని ప్రోత్సహించాలి. వారికి ఉన్న టాలెంట్ ని సద్వినియోగపరచాలి. పిల్లలను తల్లిదండ్రులు పనుల విషయంలో బలవంతం చేయకూడదు. వారికి ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికనుగుణంగా వారి ప్రతిభను అర్థం చేసుకొని వారికి ఆసక్తి ఉన్నదానిమీద ముందుకు సాగనివ్వండి . తల్లిదండ్రులు పిల్లలకున్న టాలెంట్ ను గుర్తించాలి.
Eating Too much Sweets : అధికంగా తీపి పదార్ధాలు తింటున్నారా? అయితే ఈ చేదు నిజాలు మీ కోసమే.
తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్(Roll Model) గా ఉండేలా ప్రవర్తించాలి. ముందు మీరు సామాజికంగా మారాలి. ఎక్కువ సేపు పనుల్లో బిజీ అవుతు పిల్లలతో గడిపే సమయం ఉండటం లేదు. వారికి కూడా సమయాన్ని కేటాయించాలి. పిల్లలు తల్లిదండ్రులను చూసి ఎక్కువ నేర్చుకుంటారు .కాబట్టి తల్లిదండ్రులు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.పిల్లలు సామాజికంగా కలవలేకపోవడం అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. వారు ఎంత బాధ్యతగా ఉంటారో దానిని బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుంది. ఒకప్పుడు పిల్లలతో గడిపే సమయం అధికంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేని కారణంగా పిల్లలు టీవీ(TV) మరియు మొబైల్ తో గడపడం వలన సామాజికంగా బాహ్య ప్రపంచానికి దూరం అవుతున్నారు.
కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను కనీసం వారానికి ఒకసారి అయినా బయటికి తీసుకెళ్లాలి. బయట ప్రపంచాన్ని వారికి పరిచయం చేయాలి. ఇలా చేయడం వలన మానవ సంబంధాలపై వారికి అవగాహన పెరుగుతుంది మరియు వారు సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకుంటారు.