Telugu Mirror: మన దేశం లో పెళ్లి (Marriage) అయిన తర్వాత ప్రతి ఆడపిల్ల తన పుట్టింటిని వదిలి మెట్టినింటికి వస్తుంది. అయితే ఈ రోజుల్లో కోడలి పెత్తనమే ఉండాలని అత్త పై గెలవాదానికి కోడలు ప్రయత్నిస్తూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా అత్త మామలని అవమానించేలా మాట్లాడుతుంది. ఇదే దుస్థితి లో మీరు కూడా ఉన్నారా? ఇలాంటి పరిస్థితులని ఎదురుకునే పురుషులకి ఎం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతారు.
ఇలాంటి పరిస్థితులు మీ ఇంట్లో కూడా ఉంటె బాధపడకండి. ఇలాంటి సమస్యలను సమయం ఉన్న ప్రతిసారి పరిష్కారించడానికి ప్రయత్నం చేయండి.లేకుంటే చిన్న చిన్న సమస్యలుగా భావిస్తే ఇవే సమస్యలు మానై తల్లిదండ్రులకు మరియు మీకు భార్యకు మధ్య శాశ్వతంగా దూరం పెరుగుతుంది. ఇలాంటి విషయంలో మీ భార్యను మార్చేందుకు ఒక నివేదిక ఏర్పాటు చేసాము. ఒకసారి ప్రయత్నించి చూడండి.
మాట్లాడితే గొడవ పరిష్కారం.
ఈ సమస్య సులభితరంగా పరిష్కరించబడాలి అంటే , ముందు మీరు మీ భార్య వద్దకు వెళ్లి ఈ విషయం పై పూర్తి వివరణ ఇవ్వండి. అత్త మామలను వద్ద నడుచుకే ప్రవర్తన అంత మంచిది కాదని, ఈ విషయం మీరు మీ తల్లిదండ్రుల వైపే ఉంటారని ఆమెకు అర్ధం అయ్యేలా వివరించండి. ఇలా చేయడం వల్ల అందరి దృష్టిలో ఆమె మంచిది కాదని అనుకుంటారని ఆమెకు వివరించే ప్రయత్నం చేయండి. ఇలా ఆమెతో మీరు మాట్లాడితే మీ భార్య అర్ధం చేసుకొని మారే అవకాశం ఉంటుంది.
మౌనమే భారంగా భరించండి.
మీ భార్య మీ ముందు మీ తల్లి దండ్రుల మాట వింటున్నట్టు నటిస్తుందా ? ఈ ప్రశ్నకు సమాధానము అవును అంటే మాత్రం చేయడానికి ఏమి లేదు. మీరు మౌనంగా ఉండి ఈ ఘోరాన్ని భరించక తప్పుదు. ఎందుకంటే ఇంత కన్నా దారుణమైన పరిస్థితి ఉండదు కనుక. కానీ దీనికి కూడా ఓ పరిష్కారం ఉంది. మీ ముందు నటిస్తున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రుల పక్షాన ఉండి మీ భార్యను మౌనంగా ఉండే విధంగా చేయండి. ఆలా చేయడం ద్వారా మరో సారి ఇలా చేయడానికి ఈ భార్య ఆలోచిస్తది.
సమస్య పరిష్కరించేందుకు ముందుకు రండి.
ఈ సమస్య పరిష్కారానికి వారం లో ఒకసారి అందరిని తీసుకొని ఏదైనా రెస్టారెంట్ (Restaurant) కి వెళ్ళండి. కొంత సమయం మీ తల్లిదండ్రులకు మరియు మీ భార్య మధ్య సంభాషణ జరగనివ్వండి. అలా చేయడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న బంధం గట్టిపడుతుంది మరియు మాటల గొడవలు తగ్గుతాయి.
ఈ సమస్యకి మీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందా ?
కుటుంబం లో గొడవ జరుగుతున్నప్పుడు ప్రతిసారీ సారి మీ భార్యని తిట్టడం సరియైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ సమస్యలో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతఉందో గమనించండి. ఒకవేళ మీ తల్లిదండ్రుల (Parents) తప్పు ఉంటె మీరు వారికి అర్ధం అయ్యేలా చెప్పండి. మరియు అంతా మర్చిపోయి కోడలి పై కొంచం ప్రేమ చూపించి దగ్గరికి తీసుకోమని చెప్పండి. అలా చేస్తే అనింటిని మర్చిపోయి మీ భార్య మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిపుణులు సలహా ఇంకా మంచిది.
మీరు మీ తల్లిదండ్రులతో ఉండి వారి పక్కనే జీవించాలి అనుకుంటే దానికి మీ భార్య సహకరించకపోతే స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి. మీ భార్య గురించి మరియు మీరు ఉన్న పరిస్థితిని గురించి డాక్టర్ కి పూర్తిగా వివరించండి. వారు ఇచ్చే సూచనలతో మీరు సమస్య పరిష్కారం అవుతుంది అని, ఇక పై మీ తల్లిదండ్రుల ను గౌరవిస్తుంది అని ఆశిస్తున్నాము.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…