వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి అలంకరణ (Home decoration) లో భాగంగా కొన్ని రకాల ప్రత్యేకమైన పువ్వులు, ఫోటోలు, రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆనందం మరియు అదృష్టాన్ని కూడా పొందవచ్చు.
అంతేకాకుండా కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వలన భగవంతుని ఆశీర్వాదం (God’s Blessing) కలుగుతుంది. తద్వారా జీవితం ఆనందమయం అవుతుందని చాలామంది నమ్మకం.
ముఖ్యంగా రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన శుభప్రదంగా పరిగణించవచ్చు. ఇది ఇంట్లో ఉన్న చెడు శక్తులను (Negative Energy) తొలగిస్తుందని చాలామంది భావిస్తారు.
దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సిరిసంపదలకు లోటు ఉండదని మరియు ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే ఇంట్లో రాగితో చేసిన సూర్యుడు (A sun made of copper) ను ప్రతిష్టించే ముందు వాస్తు ప్రకారం కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
ఇంట్లో సానుకూల శక్తి లభించాలంటే రాగితో చేసిన సూర్యుడిని ఏ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం.
రాగితో చేసిన సూర్యుడు ను ఇంటికి తూర్పు దిక్కు (East direction) లో ఉంచడం వలన చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి సింహద్వారం తలుపు లేదా కిటికీ లో అతికించ వచ్చు. అలా వీలు కాకపోతే గోడపై కూడా అమర్చ వచ్చు.
పూజ గదిలో ఈశాన్య గోడ (Northeast wall) పై రాగితో చేసిన సూర్యుడిని ఉంచడం వలన శుభప్రదంగా చెప్పవచ్చు. ఇంట్లో రాగి సూర్యుని అమర్చడం వల్ల ఇంట్లో ఆనందం మరియు సుఖశాంతులు శ్రేయస్సు కలుగుతాయి.
ఆఫీస్ లేదా వ్యాపారాలలో పురోగతి (progress) పొందడం కోసం గదిలో తూర్పు వైపు గోడపై రాగి సూర్యుడు ను అమర్చాలి. వాస్తు ప్రకారం రాగితో చేసిన సూర్యుడిని బెడ్ రూమ్ లో ఉంచకూడదు.
రాగి సూర్యుడిని శుభ్రపరిచే సమయంలో తప్పనిసరిగా నియమ, నిబంధనలు పాటించాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి (Positive energy) లభిస్తుంది.
రాగి సూర్యుడిని ఇల్లు లేదా ఆఫీస్ మరియు వ్యాపారాలు చేసే దగ్గర పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో చూద్దాం.
వాస్తు ప్రకారం ఇల్లు, ఆఫీస్ లేదా వ్యాపారాలలో రాగి సూర్యుడిని ఉంచడం వలన అపారమైన లాభాలు (Huge profits) చేకూరుతాయి. సూర్య భగవానుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
రాగి సూర్యుడు ఇంటిలో ఉండడం వలన సానుకూల శక్తిని పెంచుతుంది. దీనివల్ల ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా (Pleasantly) ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది.
గృహంలో ఏవైనా సమస్యలు (Problems) ఉంటే అవి తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది.
రాగి సూర్యుడు ఇంట్లో ఉండటం వలన సమాజంలో గౌరవ, మర్యాదలు (Respect and manners) లభిస్తాయని చాలామంది నమ్మకం.
వాస్తు నియమాలను పాటించి రాగితో చేసిన సూర్యుడు ను ఇంట్లో లేదా ఆఫీసులలో పెట్టుకోవడం వలన ఆ వ్యక్తికి జనాకర్షణ (Popularity)పెరిగి సత్సంబంధాలు మెరుగుపడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇంట్లో లేదా ఆఫీస్ లలో సంపద, అభివృద్ధి, శ్రేయస్సు కలగాలంటే రాగితో చేసిన సూర్యుడు ను సరైన దిశ (Right direction)లో ఏర్పాటు చేసుకోవాలి.
కాబట్టి రాగితో చేసిన సూర్యుడిని ఇల్లు లేదా ఆఫీసులలో ప్రతిష్టించడం వలన నెగిటివ్ ఎనర్జీని తొలగించి, అదృష్టాన్ని(good luck) సూర్యుడి లా ప్రకాశించే లా చేస్తుంది.
కనుక వాస్తు పై నమ్మకం ఉన్నవారు పాటించండి. అదృష్టాన్ని పొందండి.