జీవితం ప్రశాంతంగా కొనసాగాలంటే ఇంటి నిర్మాణంలో మరియు ఇంట్లో ఉండే వస్తువుల స్థానం విషయంలో వాస్తు నియమాలను పాటించాల్సిందే. లేదంటే ఏవో ఒక సమస్యలు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. వాస్తు అనేది మానవుల మానసిక ఆరోగ్యం (mental health) పై ప్రభావం చూపిస్తుందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. వాస్తు శాస్త్రం కూడా ఇదే చెబుతుంది.
కొంతమందికి సమృద్ధిగా డబ్బులు ఉండి మరియు తీరికలేని పని ఉన్న కూడా ఏదో తెలియని లోటు వీరిని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఉండడానికి కారణం వాస్తు దోషమని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వీటి నుండి బయట పడాలంటే ఎటువంటి నియమాలు ఆచరించాలో తెలుసుకుందాం.
Also Read : Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి
ఇంట్లో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఇంటి యజమాని యొక్క పడకగది ఖచ్చితంగా నైరుతి దిశ (Southwest direction) లో మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తలను దక్షిణ దిశలో పెట్టి ఉత్తర దిశలో కాళ్లు పెట్టి పడుకోవడం వల్ల చెడు ప్రభావం తగ్గుముఖం పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లయితే నిత్యం ఏదో తెలియని బాధ మరియు ఆందోళన ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించాలంటే అక్వేరియం పెట్టుకోవాలి. దీనివల్ల ఒత్తిడి మరియు అలసట తగ్గిపోయి కొత్త శక్తి, కొత్త ఉత్సాహం కలుగుతాయి. అక్వేరియం లో ఉండే చేపలు బేసి సంఖ్య (odd number) లో ఉండేలా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం అద్దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. అద్దం సరైన స్థలంలో లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బెడ్ రూమ్ లో అద్దం ఉండకూడదు. అలాగే అద్దంలో మంచం కనబడ కూడదు. ఇలా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి అధిక మవుతుందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. బెడ్ రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నట్లయితే అద్దాన్ని ఏదైనా క్లాత్ తో కప్పి ఉంచాలని చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : ఇంటి గోడలకు ఈ రంగులు వేస్తే సానుకూల శక్తులు లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తాయి
ఇంట్లో ఎప్పుడు కూడా చిన్న పిల్లల బొమ్మలు మరియు సీనరీలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న పిల్లల ఫోటోలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం తో పాటు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా అధికమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : ప్రతిరోజూ కర్పూరం తో ఇంట్లో ఇలా చేయండి, శుభ ఫలితాలను పొందండి
కాబట్టి అన్ని సౌకర్యాలు ఉండి కూడా మానసికంగా ఆందోళన ఉన్నవారు ఈ నియమాలను పాటించినట్లయితే ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు.
వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు పాటించండి. మీ సమస్యలను తొలగించుకోండి.