ప్రతి మనిషి డబ్బు సంపాదించాలని కోరుకోవడం సహజం. సంపాదించిన దానిలో నుండి కొంత పొదుపు (thrift) చేయాలనే ఆలోచన ఉంటుంది. దీనికోసం ఖర్చులు పోను ఎంతో కొంత పొదుపు చేస్తారు.అయితే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు (money) లు ఏదో ఒకదానికి వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది.
అనుకోకుండా సమస్యలు (problems) వస్తూ ఉంటాయి. దీంతో అప్పటివరకు దాచిన డబ్బు కూడా ఒకొక్కసారి నీళ్ల లాగా ఖర్చయి పోతుంది. ఏదో ఒక సమస్య రావడం వల్ల దాని నుండి బయటపడడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది.
సంపాదించిన దాని కన్నా, ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ విధంగా జరగడానికి కారణం మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లు వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుందని వాస్తు పండితులు (Vastu Pandits) చెబుతున్నారు.
డబ్బులు చేతిలో నిలవక పోతే ఇంట్లో కొన్ని వాస్తు నియమాలను పాటించినట్లయితే డబ్బు వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.
Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!
ఇంట్లో అవసరం లేని వస్తువులను మరియు వాడని వస్తువులను ఎక్కువ రోజులు ఉండటం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పనికిరాని (Useless) మరియు వాడని వస్తువులు ఉన్నట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వస్తువులు ఉంటే వెంటనే బయట పడేయాలి.
ఇంట్లో డబ్బు వృధాగా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే ఇంటికి ఉత్తర దిశ (North direction) లో తులసి మొక్కను నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. మరియు డబ్బు నిలుస్తుంది.
పగిలిన అద్దం (A broken mirror) మరియు విరిగిన వస్తువులు ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ అధికమవుతుంది. అంతేకాకుండా వీటి వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి.
ఇంట్లో వాడిన నీరు దక్షిణం మరియు పడమర దిశ (West direction) ల్లో పారితే అశుభం. ఈ విధంగా ఉంటే దరిద్రానికి ఆహ్వానం పలికినట్లు. ఈ దిశలలో నీరు ప్రవహిస్తే ఆ ఇంట్లో డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి. ఇంట్లో వాడిన నీరు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే పారాలి అని వాస్తు పండితులు చెబుతున్నారు .
Also Read : Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి
బెడ్ రూమ్ విషయంలో కూడా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. బెడ్ కి ఎదురుగా ఉన్న గోడపై ఎటువంటి పగుళ్లు (cracks) ఉండకూడదు. ఈ విధంగా ఉంటే డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది.
డబ్బులు దాచి ఉంచే అల్మారా ఏ దిశలో అయినా ఉండవచ్చు. కానీ అల్మారా ముఖం దక్షిణం (the south) వైపు ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవచ్చు .
ఇంట్లో కుళాయి (faucet) నుండి నీరు వృధాగా పోతూ ఉండటం అంత మంచిది కాదు. కొళాయి నుండి నీరు వృధాగా పోతుంటే వెంటనే రిపేరు చేయించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
చాలామంది పర్స్ విషయంలో అశ్రద్ధ గా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయినా ఒకే పర్స్ ను వాడుతుంటారు. పర్స్ చిరిగిపోయిన కూడా దానినే వాడుతుంటారు. ఇలా అసలు చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. చిరిగిన పర్స్ ను ఎటువంటి పరిస్థితులలో కూడా వాడకూడదు.
కాబట్టి ఎంత సంపాదించినా డబ్బు నిలవక పోతే ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా డబ్బు వృధా ఖర్చు అవ్వకుండా కాపాడుకోవచ్చు.