భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు రావడం అనేది సాధారణంగా అందరి ఇంట్లోను జరుగుతుంటుంది. కానీ అవి మరీ ఎక్కువ అయితే మాత్రం వారికి మనశ్శాంతి (peace of mind) అనేది ఉండదు.
ఈ ప్రభావం ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే వారు కూడా మానసికంగా (Mentally) ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
అయితే ఇంట్లో ఎక్కువగా గొడవలు (quarrels) జరుగుతూ ఉంటే బెడ్ రూమ్ కి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను పాటించినట్లయితే ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
చిన్న చిన్న దోషాల కారణంగా దంపతుల మధ్య దూరం పెరుగుతుందని వారు కనుక వీటిని తొలగించు కుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని వారు చెబుతున్నారు.
బెడ్ రూమ్ లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దంపతుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.
బెడ్ రూమ్ లో నల్ల రంగులో ఉండే వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. వీటివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ వారి మనసుపై చెడు ప్రభావం పడుతుంది. తద్వారా మనసుకు చిరాకు (Irritation of the mind) ను కలిగిస్తాయి. అలాగే తగాదాలకు కారణం అవుతాయి.
బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపించాలి. బెడ్ చిందర, వందరగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత (unity) ఉండదు.
బెడ్ రూమ్ లో ఉండే మంచం (bed) కింద ఎటువంటి వస్తువులను ఉంచకూడదు.
బెడ్ క్రింద శుభ్రంగా ఉండేలా చూడాలి. చెత్త, దుమ్ము పేరుకొని పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
ఇనుప వస్తువులు (Iron objects), చెప్పులు కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు. ఇవి ఉంటే నిద్ర కూడా సరిగా పట్టదు. వీటి వల్ల దంపతుల మధ్య గొడవలు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది.
బెడ్ రూమ్ లో ఎటువంటి ఫోటోలు, పెయింటింగ్, బొమ్మలు వంటివి కూడా ఉండకూడదు. వీటివల్ల దంపతుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
బెడ్ రూమ్ లో ఎటువంటి మొక్కలు (plants) కూడా ఉండకూడదు. వీటి ప్రభావం వల్ల కూడా దంపతుల మధ్య అన్యోన్యత (reciprocity) ఉండదు.
Also Read : Vaastu Tips : సుఖ సంతోషాలు,సిరిసంపదలు కలగాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం ‘రాగి సూర్యుడి’ని ఈ దిశలలో ఉంచాలి.
బెడ్ రూమ్ లో ఎటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు (things) కూడా ఉండకూడదు.
టీవీ, లాప్ టాప్ వంటి వాటిని బెడ్ రూమ్ కి దూరంగా ఉంచాలి. వీటి వల్ల కూడా వారి మధ్య సఖ్యత ఉండదు.
సెల్ ఫోన్ వల్ల వల్ల చాలామంది భార్య భర్తలు విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటివల్ల మనస్పర్ధలు (The conflicts of the mind)ఎక్కువగా వస్తున్నాయి. వీటిని బెడ్ రూమ్ లో పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా అనేక రకాల మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి మొబైల్స్ ను రాత్రి పడుకునే ముందు బెడ్ రూమ్ లో ఉంచకండి.
కాబట్టి భార్య భర్తల మధ్య గొడవలు అధికంగా ఉన్నవారు కొన్ని రోజులు ఈ టిప్స్ పాటించి చూడండి. తేడా ను మీరే గమనిస్తారు.
కాబట్టి వాస్తు శాస్త్రం పై నమ్మకం (trust) ఉన్నవారు పాటించండి. తద్వారా ఆనందంగా జీవించండి.