Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) ను ప్రవేశపెట్టింది, ఇది భారతీయులందరికీ సామాజిక భద్రతను అందించడానికి ప్రవేశ పెట్టిన పెన్షన్ వ్యవస్థ. ఇది ప్రధానంగా పేదలకు అనగా పనిమనిషి, డెలివరీ బాయ్ (Delivery boys) లు మరియు తోటమాలి వంటి అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
భారతీయులు తమ వృద్ధాప్యంలో ఎటువంటి అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా వ్యాధుల గురించి ఆందోళన చెందకుండా భద్రతా భావాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రైవేట్ సెక్టార్ (Private Sector) లోని ఉద్యోగులు లేదా పెన్షన్ ప్రయోజనాలను ఇవ్వని సంస్థలలో పనిచేస్తున్న వారు కూడా ఈ పథకం కోసం నమోదు చేసుకోవడానికి అర్హులు.
60 సంవత్సరాల తర్వాత రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, లేదా రూ. 5000 ఫిక్స్డ్ పెన్షన్ ను అందుతుంది. చేరే వయస్సును బట్టి, చెల్లించవలసిన మొత్తం మారుతుంది. . చెల్లించిన మొత్తాన్ని బట్టి పెన్షన్ (Pension) మారుతుంది, రూ. 1000 నుండి రూ. 5 వేలు చెల్లించవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు 60 ఏళ్లు అంటే 42 ఏళ్ల వరకు ఈ స్కీం కింద కాంట్రిబ్యూట్ చేయాలి.
18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరిన వారు 42 ఏళ్ల వరకు రూ. 210 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ళు నిండిన తర్వాత రూ.5000 పెన్షన్ లభిస్తుంది. మీరు 40 ఏళ్ల వయస్సులో చేరినట్లయితే, మీరు ఇరవై సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాలి. అయితే, రూ. 291 నుండి రూ. 1454 చెల్లించాలి. కాగా, నెలకు గరిష్టంగా రూ.1454 పెట్టుబడి పెడితే, మీకు 5,000 పెన్షన్ లభిస్తుంది.
అటల్ పెన్షన్ యోజనకు అర్హతలు?
అటల్ పెన్షన్ యోజన నుండి ప్రయోజనాలను పొందడానికి, మీరు తప్పనిసరిగా..
- భారత దేశాని కి చెందిన వారై ఉండాలి (indian citizen) .
- 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
- కనీసం 20 సంవత్సరాలు కాంట్రిబ్యూషన్ కొనసాగాలి.
- మీ ఆధార్ (Aadhaar) తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.
ఆన్‌లైన్ మోడ్
- నెట్ బ్యాంకింగ్ సేవ ద్వారా కూడా APY ఖాతాను ఆన్‌లైన్‌లో ప్రారంభించవచ్చు.
- దరఖాస్తుదారు వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ (online banking) ఖాతాలోకి లాగిన్ చేసి, డాష్‌బోర్డ్‌లో APY కోసం సెర్చ్ చేయండి.
- మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో పథకం కోసం నమోదు చేసుకున్నప్పుడు, మీరు ఆటో-డెబిట్ ఎంపికను ఎంచుకోవచ్చు.
- సభ్యత్వం పొందిన తేదీ నుండి మీకు అరవై ఏళ్లు వచ్చే వరకు ఆటో డెబిట్ అవుతుంది.
- కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ ఆన్‌లైన్ సేవను అందిస్తున్నాయి. మీ సంబంధిత బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సేవను అందిస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి.