Telugu Mirror: సినిమా కధ కాదు రియల్ స్టోరీ. ఒక ‘లైఫ్ ఆఫ్ పై’ ని తలపించే కధ.. మరో ‘కేస్ట్ అవే’ ని గుర్తుకు తెచ్చే నిజమైన కధ. ఆస్ట్రేలియా(Australia) కి చెందిన టిమ్ షాడోక్(Shaddock) మరియు అతని పెంపుడు కుక్క కి సంబంధించిన కధ.
ఆస్ట్రేలియా కి చెందిన ఒక సెయిలర్ రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తను ప్రయాణించే పడవ సముద్రం మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో, దిక్కు తోచక పాలుపోని పరిస్థితిలో గుండె ధైర్యాన్ని కూడ గట్టుకుని కాలాన్ని గడిపాడు.సముద్రంలో చిక్కుకున్న పడవలో అతని పెంపుడు కుక్క మాత్రమే అతనికి తోడుగా ఉంది. మెక్సికో(Mexico)ఓడ ఒకటి నావికుడు చిక్కుకున్న పడవ వైపు రావడం వలన అతనిని చూసి రక్షించారు. రెండు నెలల పాటు సముద్రంలో చిక్కుకుని సుధీర్ఘ నిరీక్షణ తరువాత రక్షింపబడినాడు.
ఆస్ట్రేలియా కి చెందిన సెయిలర్ షాడోక్ మరియు అతని పెంపుడు కుక్క బెల్లా(Bella)తో కలిసి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుంచి ప్రయాణమయ్యాడు. లాపాజ్ నగరం నుండి ఫ్రెంచ్ పాలినీషియా కు 6000 కిలోమీటర్లు దూరం ఉంటుంది. షాడోక్ ప్రయాణిస్తున్న పడవలో టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు.పడవ చుట్టూ నీరు,అలల భీకర హోరు తప్ప మరొకటి కనపడక రోజుల తరబడి సముద్రం మధ్యలో రెండు నెలలపాటు అలమటించాడు టిమ్ షాడోక్.
సముద్రంలోని భయంకర అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా దెబ్బతిన్నాయి.అతని వద్ద ఉన్న ఆహారం అయిపోయి దిక్కు తోచని పరిస్థితులలో ఆకలికి తాళలేక పచ్చి చేపలను తింటూ,తాగేందుకు నీళ్ళు లేక వర్షపు నీటిని పట్టుకుని తాగుతూ ఎలాగోలా తన ప్రాణాన్ని నిలుపుకుని, తనతోపాటు కలిసి ఉన్న కుక్క ప్రాణాలను సైతం నిలబెట్టినాడు.
రెండు నెలలకు సముద్రంలో అటుగా వెళ్ళిన మెక్సికోకు చెందిన పెద్ద ఓడ ఒకటి వారిని చూసి రక్షించింది. రక్షించిన సమయానికి టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి,గుర్తు పట్టలేనంతగా బక్క చిక్కి మారిపోయాడు.తనను రక్షించిన సహాయక బృందాలకు ఎప్పటికీ మర్చిపోలేను అని తన కుక్కతో తిరిగి మెక్సికో వెళ్ళి ముందుగా వైద్య పరీక్షలు చేయించి మంచి ఆహారం తీసుకోవాలని నావికుడు టిమ్ షాడోక్ అన్నాడు.