Excellent Bajaj Pulsar N250: కొత్త అప్ గ్రేడ్ లతో 2024 బజాజ్ పల్సర్-N 250 లాంఛ్. ధర చూస్తే ఇప్పుడే కొంటారు.

Bajaj Pulsar N250

Bajaj Pulsar N250 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు కంపెనీ బజాజ్ ఆటో నుంచి 2024 సంవత్సరానికి కొత్తగా అప్ డేట్ చేసిన మోడల్ పల్సర్ ఎన్ 250 ను విడుదల చేసింది. ఈ ఫ్లాగ్ షిప్ పల్సర్ బైక్ నూతన హార్డ్వేర్, లేటెస్ట్ టెక్నాలజీతో సహా అనేక నవీకరణల (Up Dates) తో వస్తోంది. 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 ధర రూ .1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ప్రకటించారు. ఈ ధరలో ఏమాత్రం తేడా లేకుండా రెగ్యులర్ మోడల్ ధరతో సమానంగా నిర్ణయించారు.

Bajaj Pulsar N250 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.

2024 బజాజ్ పల్సర్ ఎన్ 250 ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉన్న డిజిటల్ కన్సోల్ తో వస్తుంది. పల్సర్ లోని అన్ని ఎన్ సిరీస్ బైక్స్ లో డిజిటల్ కన్సోల్ లభిస్తుంది. ఇంతకు ముందు పల్సర్ ఎన్ 250 లో అనలాగ్ యూనిట్ ఉండేది..ఇప్పుడు వచ్చిన 2024 మోడల్ పల్సర్ ఎన్ 250 బైక్ మొత్తం డిజిటల్ కన్సోల్ గా మార్చారు.

ఇటీవల విడుదల చేసిన పల్సర్ ఎన్ 150, పల్సర్ ఎన్ 160 లలో ఉన్నటువంటి కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ట్రిప్ మీటర్లు, డిస్టాన్స్ టు ఎంప్టీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిజిటల్ టాకోమీటర్ వంటి ఎన్నో ఫీచర్లను ఇప్పుడు లాంఛ్ చేసిన 2024 మోడల్ పల్సర్ ఎన్ 250 (Bajaj Pulsar N250) లో కూడా అమర్చారు. 2024 మోడల్ పల్సర్ ఎన్ 250 లో ఒక్క బ్లూటూత్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, సిగ్నల్ స్ట్రెంత్ స్టేటస్, లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లో ఉన్న స్విచ్ ని ఉపయోగించడం ద్వారా ఫోన్ కాల్స్ అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటి విధానం కూడా కలిగి ఉన్నాయి.

రెయిన్, రోడ్, ఆన్ / ఆఫ్ మోడ్ లతో వస్తున్న బజాజ్ పల్సర్ ఎన్ 250:

బజాజ్ పల్సర్ ఎన్ 250 (Bajaj Pulsar N250) బైక్ ఫ్రంట్ పార్ట్ లో టెలిస్కోపిక్ యూనిట్ ల స్థానంలో యూఎస్డీ ఫోర్కులతో ముందు భాగం సస్పెన్షన్ ఉంటుంది. ఈ బైక్ లో ఇంకా ట్రాక్షన్ కంట్రోల్, 140-సెక్షన్ రియర్ టైర్, ఇంకా.. ఎబిఎస్ కోసం కొత్త రైడ్ మోడ్స్ – రెయిన్, రోడ్, ఆన్ / ఆఫ్ లను కలిగి ఉంటుంది.

2024 మోడల్ పల్సర్ ఎన్ 250 లో కొత్త గ్రాఫిక్స్ తో కూడిన న్యూ రెడ్ మరియు వైట్ రంగులతో ఆవిష్కరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చిన ఈ సెగ్మెంట్ మోటార్ బైక్ లలో అధిక బరువు కలిగి ఉన్నది. ఎందుకంటే ఈ మోడల్ కెర్బ్ బరువు 2 కిలోలు పెరగడం వలన ఈ బైక్ బరువు ఇప్పుడు 164 కిలోలకు చేరుకుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 లాంచ్: సాంకేతిక నవీకరణలు

2024 మోడల్ అప్ డేట్ చేయబడిన బజాజ్ పల్సర్ ఎన్ 250 మోటార్ బైక్ లో సింగిల్ సిలిండర్ ఇంజన్ 249 సీ సీ ఎయిర్, ఆయిల్ కూల్డ్ తో ఉంటుంది. ఇది 8,750 ఆర్ పిఎమ్ వద్ద 24.1బ్రేక్ హార్స్ పవర్ (బిహెచ్ పి), 6,500 రెవల్యూషన్ పర్ మినిట్ తో 21.5 nM గరిష్ట టార్క్ ను వృద్ది చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ బైక్ ఇంజన్, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది. మోటార్ బైక్ వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ కలిగి ఉంది. దీనిలో 300 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 230 మిమీ వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

వీల్ సైజ్ 17 అంగుళాలు, ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. ఇంకా కొత్త పల్సర్ ఎన్250లో బై ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అప్ డేటెడ్ బజాజ్ పల్సర్ ఎన్ 250 షోరూమ్ లకు మరికొద్ది రోజుల్లో రానుంది. ఇప్పుడు వస్తున్న 2024 మోడల్ అప్డేటెడ్ బజాజ్ పల్సర్ ఎన్ 250 మోటార్ బైక్ యొక్క సెగ్మెంట్లో ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, యమహా ఎంటీ-15, సుజుకీ జిక్సర్ 250, కేటీఎం 250 డ్యూక్ తదితర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Bajaj Pulsar N250

 

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in