ప్రస్తుతం మార్కెట్ లో చాలా కంపెనీల ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి.అయితే బెంగుళూరు(Banglore)కు చెందిన కసాగి(Kasagi) కంపెనీ ఇప్పుడు ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్(Oben Rorr Electric Bike ) మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్‌లో సంచలనం రేపుతోంది. ఈ బైక్‌లోని కొన్ని అంశాలు కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి.
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ నిస్సందేహంగా మార్కెట్‌ను కదిలించింది. మోటార్ ట్రేడ్ (Motor Trade)వర్గాల నివేదికల ప్రకారం, ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ జూలై 2023 చివరి వారంలో విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 187 కిలోమీటర్ల పరిధిని కలిగిఉంటుందని కంపెనీ వర్గాల సమాచారం.
Also Read:Samantha : ఆలోచనలు లేకుండా ఉండటం అసాధ్యం అంటున్న సమంత..
ఈ బైక్ యొక్క బ్యాటరీని రెండు గంటలలోపు 80% సామర్థ్యంతో ఛార్జ్ చేయవచ్చు.ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం లిథియం పాస్‌పెట్ బ్యాటరీని కలిగి ఉంది మరియు 12.3 హార్స్‌పవర్(horse power) శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుందని కసాగి కంపెనీ వారు వెల్లడించారు.
అదనంగా, ఈ బైక్ అదనపు లక్షణాలను కలిగి ఉంది మరియు ఇది కస్టమర్ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది. మీరు మీ ఫోన్‌ని మీ బైక్‌కి లింక్ చేయడం ద్వారా డ్రైవర్ అలర్ట్ మరియు జియో ఫేసింగ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు.
Also Read:Sukanya Samrudhi : కేవలం 250 రూపాయలతో డిపాజిట్, మీ చిన్నారి భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్(Ex-Show room) ధర రూ.1.49 లక్షలు, మరియు కంపెనీ, ఖాతాదారులకు అనేక EMI ప్రత్యామ్నాయాలను కూడా అందిస్తోంది. మీరు తప్పనిసరిగా రూ.30,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆపై ప్రతినెలా బైక్‌ను సొంతం చేసుకోవడానికి రూ.5,500 చెల్లించాలి.