Harley Davidson X440: హార్లే-డేవిడ్‌సన్ ప్రియులకు బంపర్ ఆఫర్..సరసమైన ధరలో X440 బైక్ ఇప్పుడు మీ కోసం..
Telugu Mirror: బైక్ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన X440 బైక్‌ను హార్లే-డేవిడ్‌సన్(Harley Davidson) భారత దేశం లో ఇటీవలే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.ఎక్స్440 బైకు ఒక్క నెలలోనే 25,597కి బుకింగ్ లను చేరుకున్నట్టు హార్లే-డేవిడ్‌సన్ వెల్లడించింది.ఈ బైక్ పై ఉన్న మక్కువ వల్ల కొనుగోలుదారులు ఊహించని స్థాయిలో మంచి స్పందనను ఇచ్చారు.పోయిన నెలలో రూ.2.29 లక్షల ధర తో భారత్ లో విడుదలయింది.
ఇండియన్ మార్కెట్లో హార్లే-డేవిడ్‌సన్ విపరీతమైన ధర ఉంటుందని అందరికి తెలుసు. ఇది హార్లే-డేవిడ్‌సన్ నుంచి వచ్చిన బైక్ లలో ఇది అత్యంత తక్కువ ధర తో వచ్చిన బైక్.భారత మార్కెట్ లో ఇంత వరకు హార్లే-డేవిడ్‌సన్ ఇంత చౌకగా ఉండే బైక్ ను విడుదల చేయడం వివేషం.ఆగష్టు 3 తో ప్రారంభ ధర ముగిసిన తర్వాత ఈ బైక్ ధర 10,500 వరకు పెరిగి రూ. 2.40 లక్షలకు చేరుకుంది. ఈ బైక్ ధర పెరగడం తో పాటు ఉత్పత్రి సామర్ధ్యాన్ని కూడా పెంచారు.
ఎక్స్440 లో టాప్ మోడల్స్ తో ఉన్న ధర రూ. 2.80 లక్షలు.ఈ చౌకైన బైక్ హీరో మోటోకార్ప్(Hero MotoCorp)తో కలిసి రూపొందించబడింది. ఈ బైక్ యొక్క రూపకల్పన చూస్తే అందరిని ఆకట్టునే విధంగా , అబ్బురపరిచేది గా ఉంది. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350(Royal Enfield 350)కన్నా రూ.35,000 మాత్రమే ఎక్కువ.
హార్లే డేవిడ్‌సన్ X440లో 440cc సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్, 27-bhp ఔట్పుట్ పవర్ మరియు 38Nm ను ఉత్పత్తి చేస్తుంది . హార్లే డేవిడ్‌సన్ X440 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజిన్ తో వస్తుంది.ఇది దాని విభాగంలో ఉత్తమమైనది.ఈ బైక్ లో ప్రత్యేకంగా 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, విలోమ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉంది.Hero MotoCorp యొక్క నీంరాన ఫ్యాక్టరీలో సెప్టెంబర్ లో Harley-Davidson X440 తయారీని మొదలుపెట్టబోతుంది.
X440 ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతుంది.ఇంత స్టైలిష్ గా మరియు సరసమైన ధర లో హార్లే-డేవిడ్‌సన్ X440 ఇండియన్ మార్కెట్ లోకి రావడం విశేషం. ఇది హార్లే-డేవిడ్‌సన్ నుంచి వచ్చిన బైక్ లలో ఇది అత్యంత తక్కువ ధర తో వచ్చిన బైక్.