Telugu Mirror : హీరో మోటొ కార్ప్(Moto Corp) తన నూతన కరిజ్మా XMR 210 బైక్ విడుదలకు సన్నద్దం అవుతుంది.విడుదలకు ముందే బైక్ కు సంభంధించిన లీక్(Leak) లు చాలా వచ్చాయి.అయితే బైక్ రిలీజ్ కు సంభంధించి కంపెనీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ,హీరో మోటొ కార్ప్ ఇండియా విడుదల చేసిన టీజర్(Teaser) వీడియో,కంపెనీ నుండి త్వరలో కొత్త ఉత్పత్తి ని ప్రారంభానికి సూచికలాగా ఉంది.ఈ టీజర్ ని అనుసరించి కొత్త ఉత్పత్తి కరిజ్మా XMR 210 అని భావిస్తున్నారు.
Dazzler Eyes : చిన్న కళ్ళ కోసం పెద్ద టిప్స్ .. ఇక అందరి చూపు ఇప్పుడు మీ వైపు..
హీరో మోటొ విడుదల చేసిన టీజర్ లో కంపెనీ రిలీజ్(Release) చేసే ఉత్పత్తి పేరును వెల్లడించనప్పటికీ,దాని విడుదల తేదీని మాత్రం ప్రకటించారు.కనుక హీరో మోటొ కొత్త కరిజ్మా XMR 210 బైక్ ని 29 ఆగస్ట్ 2023 న మార్కెట్ లోకి లాంఛ్ చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.గతంలో భారత దేశంలోని డీలర్ షిప్ లో, లాంఛ్ అవుతున్న మోటార్ సైకిల్(Motor Cycle) యొక్క ప్రొడక్షన్,అలాగే తయారైన మోడల్,లీకైన చిత్రాలలో మోటార్ సైకిల్ ను చూడటం జరిగింది.
లీకైన చిత్రాల ద్వారా మోటార్ సైకిల్ యొక్క ఆగ్రెసివ్ డిజైన్(Aggressive Design) వెల్లడి అయింది.కనిపించిన చిత్రంలో చిసెల్డ్ ఫ్రంట్ ఎండ్,షార్ప్ సైడ్ ప్యానెల్స్, కండరాల లాంటి లుక్ తో ఫ్యూయల్ టాంక్ మరియు స్ప్లిట్-స్టైల్ సీటు ఉన్నాయి.లీకైన నివేదికలను అనుసరించి,ఈ బైక్ పూర్తి LED లైటింగ్ మరియు బ్లూ టూత్ తో సెటప్ చేయబడిన డిజిటల్ ఇన్ స్ట్రు మెంట్ క్లస్టర్ కూడా ఉండవచ్చు.
Kitchen tips: మాడిపోయిన పాత్రలకు తల తల మెరిసే సూత్రాలు..
న్యూ 210cc లిక్విడ్-కూల్డ్,సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది.ఇది గరిష్టంగా 25bhp ( బ్రేక్ హార్స్ పవర్) శక్తిని విడుదల చేయగలదు.సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్(Speed Trans Mission) తో కలసి ఉంటుంది అని అంచనా.దీనిలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ లు,వెనుక వైపు మోనో షాక్,ఫ్రంట్ మరియు బ్యాక్ డిస్క్ బ్రేక్(Back Disc Brakes) లు అలాగే డ్యూయల్ – ఛానల్ ABS సిస్టమ్ కలిగి ఉంటుంది.బజాజ్ పల్సర్ F250,సుజుకి Gixxer SF250 మరియు యమహా YZF – R15 లకు పోటీగా కరిజ్మా XMR 210 నిలుస్తుందని భావిస్తున్నారు.