ola electric scooter s1x: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీ రేంజ్ లో తగ్గింపు. కొత్త స్కూటర్ కొనే వారికి మంచి ఛాన్స్.

ola electric scooter s1x

ola electric scooter s1x:

ఓలా ఎస్​1ఎక్స్​ ధరలు తగ్గింపు.

ఓలా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో అగ్రగామి సంస్థ అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ 2వీలర్ విభాగంలో టీవీఎస్, బజాజ్ మరియు ఏథర్ ఎనర్జీ వంటి ఇతర కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని నంబర్1గా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న ఓలా తాజాగా భారతదేశ వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఓలా బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటైన OLA S1X ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం ఓలా ఎస్ 1ఎక్స్ ధర ఇప్పుడు రూ. 69,999 (x-షో రూం ధర) నుంచి అందుబాటులో ఉంటుంది. ధరలు తగ్గిన ఓలా ఇతర మోడళ్ళ వివరాలను తెలుసుకోండి.

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ధర తగ్గింపు.

OLA S1X 4KWH మోడల్ ధర రూ.1,09,000 ఉండగా ఇప్పుడు దీనిపై రూ.10,000 ధర తగ్గి 99,999 కి లభిస్తుంది. అలాగే ఓలా 3KWH e – స్కూటర్ ధర రూ. 84,999గా ఉంది. OLA S1X 2KW ఎలక్ట్రిక్​ స్కూటర్​ యొక్క ధర రూ. 69,999 ఇది అన్ని వేరియంట్ ల కన్నా తక్కువ ధరను కలిగి ఉంది. పైన పేర్కొన్న ఓలా ఈ-స్కూటర్ ల ధరలన్నీ ఎక్స్​షోరూం ధరలు.

7 కలర్ వేరియంట్ లలో ఓలా ఎస్1ఎక్స్ అందుబాటులో ఉంటుంది. వచ్చే వారం నుండి ఎస్1ఎక్స్ డెలివరీ ప్రారంభం అవుతుందని సంస్థ ప్రకటించింది.

ఎస్​1ఎక్స్​ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 అంగుళాల స్క్రీన్​, 34 లీటర్​ బూట్​ స్పేస్​, ఓలా ఐకానిక్​ హెడ్​ల్యాంప్​, గ్రాబ్​ రెయిల్​ ఇంకా ఇతర ఫీచర్స్ కలిగి ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల తాజా సమాచారం : 4KWH మోడల్ రేంజ్.190 కి.మీలుగా ఓలా పేర్కొంది. 2 కేడబ్ల్యూహెచ్​ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్లు అలాగే 3KWH స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 143 కి.మీలు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. 2, 3 కేడబ్ల్యూ మోడల్ స్కూటర్ లు ఫిజికల్​ కీతో వస్తాయి.

ఓలా ఎలక్ట్రిక్​ తన కేటలాగ్ లోని ఎలక్ట్రిక్​ స్కూటర్ల​ ధరలను తగ్గించడం ఇదేమి మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో S1X ప్లస్, S1 ఎయిర్​, S1 ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్ ల ధరలను తగ్గించింది. అయితే అన్నిటికన్నా S1X ప్లస్ ధరను ఓలా రూ. 25వేల వరకు తగ్గించడం చెప్పుకోదగిన విషయం.

అంతేకాకుండా ఎలాంటి అదనపు ఛార్జ్ తీసుకోకుండానే అదనపు సేవల క్రింద 8 సంవత్సరాలు లేదా 60వేల కి.మీలతో ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారెంటీని కూడా ప్రవేశపెట్టింది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి ఓలా సంస్థ తన వేరియంట్ లపై ధరలు తగ్గించడం ఒక మంచి అవకాశం.

ola electric scooter s1x

 

 

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in