Powerful Ather Rizta Electric Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఏథర్ రిజ్టా పేరుతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌లో పొడవాటి సీటును, అధిక లెగ్‌స్పేస్‌ను అందించారు. ముఖ్యంగా ఫ్యామిలీలకు సెట్ అయ్యేలా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఇంతకీ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లు రిజ్టా ఎస్ (Rizta S) మరియు రిజ్టా జెడ్ (Rizta Z ) మోడళ్లలో విడుదలయ్యాయి. రిజ్టా S స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. రిజ్టా జుడ్లో 3.7 kW అలాగే అందించారు. ఈ స్కూటర్ ఒక్క బ్యాటరీతో 123 కిలోమీటర్లు ప్రయాణించగలదు. స్కూటర్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ 160 కిమీ వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్ తో గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
రిజ్టా SX ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 లక్షలు. అదేవిధంగా, రిజ్టా జెడ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.25 లక్షలు. Rizta S మరియు Rizta Z వరుసగా మూడు మరియు ఏడు రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇ-స్కూటర్ యొక్క బేస్ మోడల్ 7-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది.
It has safety for your loved ones, smarts to stay connected and space to carry it all.
Make the #AtherRizta yours at an introductory price of ₹1,09,999 at https://t.co/2x9QLbOxox#Ather #FamilyScooter #NewLaunch pic.twitter.com/gYnr6R2mgf
— Ather Energy (@atherenergy) April 6, 2024
మిగిలిన మోడళ్లలో 7-అంగుళాల TFT డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ వినియోగదారులు Google Maps వంటి ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఫోన్లు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక కాన్ఫిగరేషన్ కూడా ఉంది.
ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలానే మోడల్స్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ మరో కొత్త మోడల్ ని తీసుకొచ్చింది. పైగా ఈ మోడల్ బడ్జెట్ లో ఉండటం విశేషం. ఇప్పుడు ఈవీలు అంటే రూ.1.5 లక్షలకు తక్కువ ఉండటం లేదు. కానీ, ఏథర్ ఇప్పుడు రిజ్తా అనే మోడల్ ని కేవలం రూ.1,09,999కే అందిస్తోంది.