Royal Enfield bullet : రాయల్టీ కి సింబల్ గా కనిపించే బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield). చాలామంది ఈ బైక్ ను జీవితంలో ఒక్కసారైనా వాడాలని ఆశ పడుతుంటారు. రాయల్ ఎన్ ఫీల్డ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బైక్ పై వెళ్తుంటే చాలు. డుగ్.. డుగ్ అంటూ వచ్చే సౌండ్ కి ఆ వీధి మొత్తం షేక్ అవ్వాల్సిందే.
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ 350 రకం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైకులలో ఒకటి. ఈ మోటర్ బైక్ కాలానుగుణంగా డిజైన్ మారినప్పటికీ, బైక్ మోడల్ చాలా వరకు అలాగే ఉంది.
బహుశా అందుకేనేమో ఈ బైక్ పట్ల ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఇంకా తగ్గలేదు. రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) తమ మోటార్ బైక్ ఫీచర్లను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తుంది. దీంతో సామాన్య ప్రజల్లో దీని ఆదరణ తగ్గలేదు. అదనపు ఫీచర్ల కారణంగా, ఈ మోటార్‌బైక్ ధర పెరిగింది.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధర ప్రస్తుతం రూ. 1,50,795 నుండి రూ. 1,65,715 (ఎక్స్-షోరూమ్) మధ్య మారుతోంది. అత్యధిక మోడల్ ధర రూ.2 లక్షల కంటే ఎక్కువ. రోడ్డుపైకి వచ్చే సమయానికి ఈ బుల్లెట్ ధర రూ. 2-2.3 లక్షలు.
ఈ రోజుల్లో ఈ ఫ్యాన్సీ మోటార్ సైకిళ్ల (Motor Cycle) కు కేవలం ఒక నెల పాకెట్ మనీ ఖర్చవుతుందని మీరు ఆలోచించారా? 1986 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) మోడల్‌కి సంబంధించిన బిల్లింగ్ పేపర్‌వర్క్ వైరల్ అవుతోంది. బైక్ పై ఉన్న ధరను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు లక్షలు ఖరీదు చేసే ఈ బైక్ ధర అప్పట్లో రూ.18,700 మాత్రమే. ఇది 1986 నాటి బైక్ అంటే.. 38 ఏళ్లకు పైగా పాతది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని సందీప్ ఆటో నుండి వచ్చిన బుల్లెట్ 350 మోడల్ బిల్లు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ (Royal Enfield Bullet) 1986లో ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌గా పిలిచేవారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్వెంటరీ నుండి ఒక పురాతన బైక్. బుల్లెట్ ఇప్పుడు రెండు మోడళ్లలో వస్తుంది. ఒకటి బుల్లెట్ 350 మరియు ఇంకొకటి బుల్లెట్ 350 ES. ఆధునిక బుల్లెట్ 350 బరువు 191 కిలోగ్రాములు. ఈ బైక్ లీటరుకు 37 కి.మీ మైలేజీని ఇస్తుంది.