Royal Enfield Himalayan 450 Review after driving: రాయల్ ఎన్ఫీల్డ్ 450 యొక్క రైడింగ్ రివ్యూ మీ కోసం.

హిమాలయన్ 450 లిక్విడ్ కూల్డ్ మోటార్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మొదటి మోటార్‌సైకిల్ - 452cc సింగిల్-సిలిండర్ ఇంజన్ 40PS మరియు 40Nm తో ఈ బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అయింది.

Royal Enfield Himalayan 450 Review after driving : రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త హిమాలయన్ 450 అనేది హిమాలయన్ 411 యొక్క నెక్స్ట్ వెర్షన్. ఇది రీసెంట్ గా రిలీజ్ అయినప్పటికీ సేల్స్ చాలా బాగా అయ్యాయి. హిమాలయన్ 450 లిక్విడ్ కూల్డ్ మోటార్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మొదటి మోటార్‌సైకిల్ – 452cc సింగిల్-సిలిండర్ ఇంజన్ 40PS మరియు 40Nm తో ఈ బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అయింది. కంపెనీ ఈ కొత్త హిమాలయన్‌ను సిటీ రైడింగ్ కోసం మరియు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం డిజైన్ చేసినట్టు పేర్కొంది. అయితే ఈ బైక్ యొక్క ఓనర్ షిప్ రివ్యూ మరియు కొన్ని నెలల డ్రైవింగ్ తర్వాత బైక్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనే రివ్యూ ఇప్పుడు చూద్దాం.

  • Seat Height : సీటు హయిట్ అనేది మనకి కావలిసిన విధంగా సెట్ చేస్కోవచ్చు, పొట్టి రైడర్‌లు మరియు ఎత్తైన రైడర్లు వాళ్లకి కావాల్సిన సీట్ లెవెల్ ని సెట్ చేసుకొని కంఫర్ట్ గా డ్రైవ్ చేయవచ్చు.
  • Weight and Balance : బైక్ బాగా బ్యాలెన్స్‌గా ఉంటుంది, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు తేలికగా అనిపిస్తుంది. అయినప్పటికీ, దాని బరువు కారణంగా బైక్ ఆగి ఉన్నపుడు ఆపాలి అంటే కొంచం కష్టంగా ఉంటుంది.
  • City Riding : బైక్ సిటీలో డ్రైవ్ చేయడం తేలికనే, అయితే ఇది 3,000 RPM కంటే తక్కువలో డ్రైవ్ చేస్తున్నపుడు ఇంజిన్ మీద లోడ్ పడినట్టు అనిపిస్తుంది. క్లచ్ తేలికగా అనిపిస్తుంది మరియు గేర్‌బాక్స్ మృదువుగా ఉంటుంది, అయితే మొదటి మరియు రెండవ గేర్ మధ్య చేంజ్ అయ్యేటప్పుడు కష్టంగా ఉంటుంది.
  • Heat Management : లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో వేడిని ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇది మరీ ఎక్కువ ఏమి లేదు.
  • Vibrations: బైక్‌లో వైబ్రేషన్‌లు ఉన్నాయి, ముఖ్యంగా 5,000 ఆర్‌పిఎమ్ దాటితే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, వాటిని బయట సర్వీస్ సెంటర్లో సెట్ చేపించవచ్చు.
  • Fuel Efficiency : సిటీ రైడింగ్‌లో, హిమాలయన్ 450 లీటరుకు దాదాపు 29.5 కి.మీ మంచి మైలేజీని అందిస్తోంది.
  • Highway Cruising : బైక్ 6.91 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు, హైవేలపై చక్కని డ్రైవింగ్ ఫీల్ ని ఇస్తుంది. ఇది 100-110 km/h వేగంతో సౌకర్యవంతంగా ప్రయాణించగలదు.
  • Comfort :హిమాలయన్ 450 లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉంటుంది, విశాలమైన సీటు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు రైడర్ కి మంచి కంఫర్ట్ ని ఇస్తుంది.

Royal Enfield Himalayan 450 Review after driving

  • Off-Roading : ఇది స్మూత్ పవర్ డెలివరీని ఇస్తుంది దాని వల్ల ఆఫ్-రోడ్ డ్రైవింగ్ ఈజీగా అనిపిస్తుంది. అయితే, ఫ్రంట్ ఎండ్ కొంచం హెవీగా  అనిపించవచ్చు మరియు అనుభవజ్ఞులైన ఆఫ్-రోడ్ రైడర్‌లకు ఇది బాగా యూజ్ అవుతుంది.
  • Handling and Braking : బైక్ కార్నర్ టర్నింగ్ లో బాగా హ్యాండిల్ చేస్తుంది, త్వరగా లీన్ అవుతుంది మరియు స్టెబిలిటీ అందిస్తుంది. బ్రేకింగ్ బాగుంది, కానీ ఫ్రంట్ ఎండ్ హార్డ్ బ్రేకింగ్ కింద డైవ్ చేస్తుంది, ఇది కొంచం బయపెడ్తుంది బ్రేకింగ్ లో.
  • Touring and Exploration : సౌకర్యవంతమైన సీటింగ్ మరియు మంచి పనితీరుతో, హిమాలయన్ 450 తెలియని ప్రదేశాలను అన్వేషించడానికి అనుకూలంగా ఉంటుంది, ప్రత్యేకించి Google Maps ఇంటిగ్రేషన్ యొక్క అదనపు ఫీచర్‌తో.
  • చివరిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అనేది ఒక చక్కటి పెర్ఫార్మన్స్  బైక్, ఇది వివిధ రోడ్ల పై బాగా కంట్రోల్ మరియు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది, ఇది సమర్థవంతమైన ఆల్-రౌండర్ కోసం వెతుకుతున్న రైడర్‌లకు చక్కటి ఛాయస్.

Comments are closed.