Suzuki Access125 Electric Version: సుజుకి నుండి కొత్త ఈవీ, ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

Suzuki Access125 Electric Version

Suzuki Access125 Electric Version: ఆటోమొబైల్స్ విషయంలో సుజుకి కంపెనీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఈ జపనీస్ సుజుకి కంపెనీ త్వరలో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తమ పాపులర్ మోడల్ అయిన యాక్సెస్ 125 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఈ ఏడాది చివర్లో భారతదేశంలో లాంచ్ చేయాలని సుజుకి భావిస్తుంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు ఇప్పుడు విద్యుత్ తో నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే, సుజూకి లాంచ్ చేయబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఒకసారి చూద్దాం.

సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇప్పటికే సుజుకి కంపెనీ నుండి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి చాలా వచ్చాయి. స్కూటర్ టెస్ట్ సమయంలో వ్యూస్ వచ్చినప్పటికీ, దాని విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. యాక్సస్ 125 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

సుజుకీ ఈ-యాక్సిస్ గా పేరు..

ఈ కొత్త స్కూటర్ ను ఇ-బర్గ్ మ్యాన్ పేరును అనుసరించి ఇ-యాక్సిస్ పేరుతో పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే, డిజైన్ పరంగా అది చూడడానికి ఇ-బర్గ్ మ్యాన్ లాగానే ఉంటుంది. స్టైలింగ్, బాడీ కంపోనెంట్స్ మరియు పెట్రోల్ ఆధారిత వేరియెంట్ వలె ఉంటుంది. కొన్ని చిన్న మార్పులు అంటే కొత్త Ev లోగో ఎకో-ఫ్రెండ్లీగా ఉండేందుకు ‘బ్లూ’ పెయింట్ స్కీం వంటి మార్పులు ఉంటాయి. ధరను తగ్గించడానికి కొన్ని ఫీచర్లను మార్చలేకపోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

బ్యాటరీ పనితీరు, రైడింగ్ రేంజ్ కి సంబంధించిన వివరాలు ఇంకా వెలువడలేదు. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనం (EV) 125cc ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్‌ పనితీరును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ICE వెర్షన్ 4-స్ట్రోక్, 1-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో 8.7 ps అవుట్‌పుట్ మరియు 10 Nm టార్క్ ను కలిగి ఉంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ కూడా ఉంది. ప్రస్తుతం, ఇది హోండా యాక్టివా 125, యమహా ఫాసినో 125 మరియు TVS జూపిటర్ 125 లకు పోటీగా ఉంది.

సుజుకి యాక్సిస్ ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధర తగ్గించి కస్టమర్‌లను ఆకర్షించడమే ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Suzuki Access125 Electric Version

 

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in