Tvs jupiter zx drum: అతి చౌకైన ధర, ప్రత్యేక ఫీచర్స్ తో అందరి మెప్పును పొందుతున్న జూపిటర్ ZX డ్రమ్ స్కూటర్‌

స్కూటర్లు కూడా ఈ మధ్య కాలం లో స్మార్ట్ గా మారిపోతున్న నేపథ్యం లో జూపిటర్ ZX డ్రమ్ స్కూటర్‌ కూడా ఆ జాబితాలో చేరింది.తక్కువ ధర లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఈ స్కూటర్ గురించి తెలుసుకుందాం.

telugumirror: భారత దేశంలో సరికొత్త జూపిటర్ ZX డ్రమ్(Tvs jupiter zx drum)స్కూటర్‌ను TVS విడుదల చేసింది.అద్భుతమైన టెక్నాలజీ తో SmartXonnect బ్లూటూత్(Bluetooth)ని కలిగి ఉన్న ఈ స్కూటర్ రూ. 84,489లో అందరి ముందుకు రానున్నది . ZX వేరియంట్ తో SmartXonnect బ్లూటూత్ తో వచ్చి త్వరలో అందరి మెప్పును పొందబోతుంది. జూపిటర్ ZX డ్రమ్ వేరియంట్ (ఎక్స్ – షోరూమ్) రూ. 84,468 లలో లభించబోతుంది .ఈ స్కూటర్ ఆకర్షణీయమైన రెండు రంగులతో మన ముందుకు రాబోతుంది . ప్రత్యేకమైన రంగులు ఆలివ్ గోల్డ్ మరియు స్టార్‌లైట్ బ్లూ వైబ్రెంట్ రంగులతో ఉంది. డ్రమ్ వేరియంట్ కాకుండా ఏడు వేరియంట్స్ పరిమితిని జూపిటర్ కలిగి ఉంది .వాటి ధర రూ. 73,240- రూ. 89,648 మధ్యలో ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ జూపిటర్ భారత్ లో హోండా యాక్టివాతో పోటీ పడుతున్నది .

TV's zupiter zx Drum model launched in india
Image credit: Bike Junction – Tractor Junction

Also Read:Ola Electric Bikes: లక్ష లోపు Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 X.. సరికొత్తగా ఆగష్టు 15 న మార్కెట్ లోకి

TVS జూపిటర్ ZX డ్రమ్ ఫీచర్లు : 

TVS బ్లూటూత్-ప్రారంభించబడిన SmartXonnect సాంకేతికత జూపిటర్ ZX డ్రమ్‌కు అనేక లింక్డ్ ఫంక్షన్‌లను కలిగి ఉంది. అధిక-పనితీరును కలిగిన ఈ స్కూటర్ 107.7cc మరియు సింగల్-సిలిండర్ తో శక్తివంతమైన ఇంజిన్ ను కలిగి ఉంది.7.8hp పవర్ మరియు 8.8Nm మేకింగ్ ఎయిర్-కూల్డ్ ని ఉత్పత్తి చేస్తుంది.ఫీచర్ల పరంగా చూస్తే SMS మరియు కాల్స్ ను నోటిఫికేషన్ హెచ్చరిక ను అందిస్తుంది.రైడర్స్ కు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఫీచర్‌లను అనుభవించడానికి అనుమతిస్తుంది.ఇంజిన్ ప్రతిక్షణం వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT)తో జత చేయబడింది.ఈ స్కూటర్ ముందు,వెనక ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంది.ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ సహాయంని అందిస్తుంది. స్కూటర్ లో USB చార్జర్ కూడా అందుబాలో ఉంటుంది. సస్పెన్షన్ విధులు మోనోషాక్ సెటప్ మరియు టెలిస్కోపిక్ ఫోర్క్ ద్వారా నిర్వహించబడతాయి.రైడర్స్ కు సౌకర్యవంతంగా వివిధ రకాల సీటింగ్ పొజీషన్ ని అమర్చడం జరిగింది .డ్రమ్ వేరియంట్ లో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ,రైడర్స్ కి ప్రమాదాల నుండి కాపాడేందుకు ఎక్కువ ప్రభావితం చేసే డ్రమ్ బ్రేక్ లు కూడా ఉన్నాయి . అత్యంత వేగం తో వెళ్లిన కూడా ఆపే స్టామిన ని కలిగి ఉంటుంది.

ఆకర్షణీయమైన ఫీచర్స్ , సమన్వయమైన ఇంజిన్ మరియు పరిమాణ శక్తి కలిగిన డ్రమ్ బ్రేక్ లతో కూడిన TVS జూపిటర్ ZX డ్రమ్ వేరియంట్ మార్కెట్ లో కస్టమర్స్ నమ్మదగినదిగా మరియు కొనుగోలు చేయదగినది గా ఉంది .

Leave A Reply

Your email address will not be published.