Bajaj CNG Bike : వాహనదారులుఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Compressed natural gas (CNG) బైక్‌లు ఇప్పుడు భారత మార్కెట్ లోకి రాబోతున్నాయి. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే తొలి CNG ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు వెల్లడించారు. రాజీవ్ బజాజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ CMD శేఖర్ బజాజ్ మరియు బజాజ్ ఆటో CMD నీరజ్ బజాజ్‌లతో కలిసి ఈ ప్రకటన చేసారు.
ఈ సందర్భంగా రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ ఈ బైక్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని, రానున్న మూడు నెలల్లో స్థానిక మార్కెట్‌లో పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. సిఎన్‌జి (CNG) ఆటోమొబైల్స్ నడపడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 60 శాతం ఆటోలు సీఎన్‌జీతోనే నడుస్తున్నాయని, తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుండటం మంచి పరిణామమన్నారు.
Also Read : BMW iX50 Magnificent EV: BMW నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్, దాని వివరాలు మీ కోసం.
ఇదే బాటలో ఇప్పుడు బజాజ్ కంపెనీ CNG ద్విచక్ర వాహనాన్ని రూపొందించడానికి ముందడుగు వేస్తున్నాం అని తెలిపింది. ఆటోమొబైల్స్ మరియు ఆటోలలో సిఎన్‌జి సిలిండర్‌ను (CNG cylinder) ఉంచడానికి స్థలం ఉంది, కానీ బైకుకు సిలిండర్ ఏ చోట పెడితే బాగుంటుందన్న అంశంపై అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ఈ బైకు ధర రూ.70 వేల నుంచి 80 వేల స్థాయిలో ఉంటుందని రాజీవ్ బజాజ్ చెప్పారు.
20 ఏండ్ల క్రితం మార్కెట్లో విడుదల చేసిన పల్సర్ మోడల్ మోటారు సైకిళ్లకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన, ఆదరణ లభించిందని రాజీవ్ బజాజ్ తెలిపారు. త్వరలో బజాజ్ పల్సర్ విక్రయాలు 20 లక్షల యూనిట్లకు చేరతాయని చెప్పారు. పల్సర్ బజాజ్ మోటారు సైకిలు మాదిరిగానే బజాజ్ సీఎన్జీ బైక్‌ను కూడా కస్టమర్లు ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
ఐదేండ్లల్లో సిల్ డెవలప్‌మెంట్‌పై 5 వేల కోట్లు.
రాబోయే ఐదేండ్లలో సిల్ డెవలప్‌మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బజాజ్(Bajaj) సంస్థ ప్రకటించింది. బజాజ్ (Bajaj) బియాండ్ పేరుతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఆయా మొత్తాన్ని నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఈ ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందినవారు బజాజ్‌తోపాటు (Bajaj) ఏ కంపెనీలోనైనా ఉద్యోగాలు పొందవచ్చు అన్నారు. అనంతరం పుణెలోని సింబాయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన బజాజ్ ఇంజనీరింగ్ సిల్స్ ట్రైనింగ్ సెంటర్‌ను రాజీవ్ బజాజ్ ప్రారంభించారు.