Bank Charges : దేశంలోని అతిపెద్ద బ్యాంకులు మే 1 నుండి కొన్ని సవరణలు చేయనున్నాయి. ఆ ప్రైవేట్ బ్యాంక్‌లలో మీరు ఖాతాను కలిగి ఉన్నట్లయితే, వచ్చే నెల నుండి బ్యాంకుల్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకోండి. అయితే, ఈ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల (Savings Account) చార్జీలలో మార్పులు చేయాలని చూస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ :
ICICI బ్యాంక్ అనేక సేవింగ్స్ ఖాతా సేవలకు కొత్త చార్జీలను ప్రకటించింది. ఈ మార్పులు చెక్‌బుక్‌లు, IMPS, ECS/NACH డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు మరియు ఇతర సేవలపై ప్రభావం చూపుతాయి. కస్టమర్లు ఇప్పుడు వార్షిక డెబిట్ కార్డ్ ఫీజు కోసం గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ. 200 లేదా సంవత్సరానికి రూ. 99 చెల్లించాలి.
బ్యాంక్ ప్రతి సంవత్సరం 25 ఉచిత చెక్ లీవ్‌లను అందిస్తుంది. ఆ తర్వాత ఒక్కో లీవ్ కు రూ.4 చొప్పున చెల్లించాలి. డెబిట్ కార్డ్ పిన్ క్రియేషన్, డెబిట్ కార్డ్ డి-హాట్‌లిస్టింగ్, ఖాతా మూసివేత, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్‌వర్డ్ రీఇష్యూ మరియు బ్రాంచ్‌లలో అడ్రస్ మార్పు అన్నీ ఉచితం.
యస్ బ్యాంక్ :
యస్ బ్యాంక్ (Yes Bank) తన సేవింగ్స్ ఖాతా ఛార్జీలను సవరించింది. కొన్ని రకాల ఖాతాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని ఖాతాలు ఇప్పుడు సవరించిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (AMB) రిక్వయిరీమెంట్ చార్జీలను సవరించింది. అవసరమైన బ్యాలెన్స్ నిర్వహించకపోతే, షార్ట్‌ఫాల్ మొత్తం శాతాన్ని బట్టి ఛార్జీలు లెక్కిస్తారు. బ్యాంక్ ఎంచుకున్న వివిధ ఖాతా రకాలు మరియు స్థానాలకు AMB రిక్వయిరీమెంట్ విభిన్నంగా ఉంటాయి. వివిధ నాన్-మెయింటెనెన్స్ (Non-maintenance) ఖర్చులు కూడా ఉన్నాయి.
ఎలిమెంట్ డెబిట్ కార్డ్ కోసం వార్షిక ఛార్జీ రూ.299. ఎంగేజ్ డెబిట్ కార్డ్ ధర రూ.399, ఎక్స్‌ప్లోర్ డెబిట్ కార్డ్ ధర రూ.599. రూపే డెబిట్ కార్డ్ (కిసాన్ ఖాతాకు) సంవత్సరానికి రూ.149 ఛార్జీ చెల్లించాలి. ఎస్ బ్యాంక్ ఇతర బ్యాంకుల ATMలలో నెలకు మొదటి ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తుంది. ప్రతి తదుపరి ఆర్థిక లావాదేవీకి రూ. 21, ఆర్థికేతర లావాదేవీలకు రూ. రూ. 10 చార్జీలు ఉంటాయి.