Bank News 2024 : బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న ప్రముఖ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ముఖ్యమైన నిర్ణయం చేసింది. ఇది వినియోగదారులపై చేడు ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. కొత్త నియమాలు నేటి నుంచి అమల్లోకి రానుంది.
బ్యాంక్ రుణగ్రహీతలకు ఝలక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) రుణగ్రహీతలకు ఝలక్ ఇచ్చింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని సవరించింది. ఇది ఎంపిక చేసిన టెన్యుర్లకు వస్తుంది. రుణ రేటు సవరణ ఏప్రిల్ 15 నుంచి అంటే ఈరోజు నుండి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటించింది.
ఎంసీఎల్ఆర్ రేటు పెరగడంతో రుణగ్రహీతల నెలవారీ EMIని కూడా ప్రభావితం చేస్తుంది. ఈఎంఐ కూడా పెరుగుతుంది. అయితే, ఇది రీసెట్ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. దానితో, వినియోగదారులపై భారం పెరుగుతుంది.
MCLR ఐదు బేసిస్ పాయింట్లు పెరిగింది
బ్యాంక్ ఓవర్నైట్ MCLR ఐదు బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది 8% నుంచి 8.05%కి పెరిగింది. నెలవారీ ఎంసీఎల్ఆర్ రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇది 8.2% నుంచి 8.25%కి పెరిగింది.
మూడు నెలల MCLR రేటు 8.4% గా ఉంది. అయితే ఇప్పుడు అది 8.45 శాతానికి పెరిగింది. అంటే ఇది 5 బేసిక్ పాయింట్లకు పెరిగింది. ఆరు నెలల MCLR రేటు కూడా 8.65% నుండి 8.70%కి పెరిగింది. వార్షిక MCLR రేటు 8.8 శాతం నుండి 8.85 శాతానికి పెరిగింది. ఐదు బేసిస్ పాయింట్లు కూడా పెరిగాయి. చాలా బ్యాంకులు తమ రుణాలకు వార్షిక MCLR రేటును లింక్ చేస్తాయి.
రెండు సంవత్సరాల మరియు మూడు సంవత్సరాల MCLR రేట్లు వరుసగా 8.85 శాతం మరియు 8.95 శాతానికి పెరిగాయి. బ్యాంకులు MCLR రేటు కంటే తక్కువ రుణాలు ఇవ్వరు. అంటే MCLR రేటును కనీస రుణ రేటుగా చెబుతారు.
దాంతో, బ్యాంకు రుణాలు తీసుకునే వారికి నష్టం వాటిల్లుతుంది. అంటే, ఇది మునుపటి పద్ధతిలోనే కొనసాగుతుంది. దీని అర్థం మీరు గతంలో కంటే ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందవలసి ఉంటుందని రుణగ్రహీతలు దీన్ని గుర్తుంచుకోవాలి. తక్కువ రుణ రేటు ఉన్న బ్యాంకు నుండి రుణం పొందడం ఉత్తమం.
టెన్యూర్ | MCLR రేట్లు |
ఓవర్నైట్ | 8.05% |
ఒక నెల | 8.25% |
మూడు నెలలు | 8.45% |
ఆరు నెలలు | 8.70% |
ఒక సంవత్సరం | 8.85% |
రెండు సంవత్సరాలు | 8.85% |
మూడు సంవత్సరాలు | 8.95% |
Also Read : Voter Registration 2024 ,Useful Information : ఓటు ఇంకా నమోదు చేసుకోలేదా? ఈరోజే లాస్ట్ ఛాన్స్.