Bank Holiday 2024, Useful News : ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఆ రోజు సెలవు, ఎందుకంటే?

Bank Holiday 2024

Bank Holiday 2024 : తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కారణంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే 13, సోమవారం పోలింగ్ జరగనుండగా, తెలంగాణ కార్మిక శాఖ ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా (paid holiday) ప్రకటించింది, తద్వారా వివిధ సంస్థల ఉద్యోగులు మరియు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంఘాల చట్టాల ప్రకారం వేతనంతో కూడిన సెలవును ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ను (Election Schedule) విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.అయితే ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల (nominations) దాఖలుకు అవకాశం ఉండగా, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.అయితే ఏప్రిల్ 29వ తేదీని విత్ డ్రా గడువుగా నిర్ణయించారు. మే 13 న, ఓటర్లు తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

Bank Holiday 2024

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు..

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా ప్రకటించారు. ఎన్నికలకు సన్నాహకంగా అనేక విధానాలు అమలు చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికలకు లక్షా 80 వేల మంది సిబ్బంది అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ఎన్నికల అధికారులకు సమగ్ర శిక్షణ కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 8,58,491 ఓట్లు తొలిగించనున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉంటే 8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారు.

Bank Holiday 2024

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in