Canara Heal : బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అన్ని వర్గాల ప్రజలకు సహాయాన్ని అందిస్తుంది. మారుతున్న అవసరాలను బట్టి మరియు సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆర్థిక ప్రొడక్ట్స్ ని పరిచయం చేస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ తాజాగా ‘కెనరా హీల్’ పేరుతో ప్రత్యేకమైన రుణ స్కీంను ప్రవేశ పెట్టింది. దీనితో పాటు, అనేక కొత్త ప్రొడక్ట్స్ ప్రవేశ పెట్టాయి. మరి ఇంతకీ ఆ ప్రొడక్ట్స్ ఏమిటి? వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.
కెనరా హీల్ లోన్ పథకం.
ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అవసరం. ఈరోజుల్లో వైద్య చికిత్సలకు చాలా ఖర్చు అవుతుంది. అయితే, అన్ని పాలసీలు అన్ని వైద్య ఖర్చులకు ఇన్సూరెన్స్ అందించవు. కొన్ని పరిస్థితులలో, ప్రజలు తమ సొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా కవరేజీ పరిధిలోకి రాని హాస్పిటల్ బిల్లులను కవర్ చేయడానికి కెనరా బ్యాంక్ ప్రత్యేకమైన కెనరా హీల్ లోన్ పథకాన్ని రూపొందించింది.
కెనరా హీల్ స్కీమ్ సంవత్సరానికి 11.55% ఫ్లోటింగ్ వడ్డీ రేటును వసూలు చేస్తుంది. లేదా 12.30% ఫిక్స్డ్ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తుంది. బీమా కవరేజీని మించిన వైద్య ఖర్చులు ఉన్న వినియోగదారులకు ఈ రుణం అందుబాటులో ఉంటుంది.
తాజా ప్రొడక్ట్స్ ఏంటి?
మహిళల కోసం కెనరా ఏంజెల్ పేరుతో కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాను అభివృద్ధి చేసింది. మహిళలు పొదుపు ఖాతాను ఓపెన్ చేసినప్పుడు ఉచిత క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (కెనరా రెడీక్యాష్) మరియు ఆన్‌లైన్ టర్మ్ డిపాజిట్ లోన్‌లు (కెనరా మైమనీ) పొందవచ్చు. ఇప్పటికే ఉన్న మహిళా ఖాతాదారులు ఈ ప్రయోజనాలను పొందేందుకు తమ ఖాతాలను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని బ్యాంక్ వివరించింది.
కెనరా బ్యాంక్ ఉద్యోగుల చెల్లింపులను సులభం చేసేందుకు.
డిజిటల్ సేవల పరంగా, కెనరా బ్యాంక్ ఉద్యోగుల చెల్లింపులను సులభతరం చేయడానికి ‘కెనరా UPI 123Pay ASI’ మరియు ‘కెనరా HRMS మొబైల్ యాప్’లను విడుదల చేసింది. ఇంకా, కెనరా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ సెంటర్‌తో కలిసి SHG e-MONEY అనే కొత్త పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు (SHGs) డిజిటల్ సేవలను అందించడానికి సహకరిస్తోంది.
SHG సభ్యుల ఇన్స్టంట్ డిజిటల్ క్రెడిట్ పొందవచ్చు.
దీని ద్వారా SHG సభ్యులు ఇప్పుడు ఇన్స్టంట్ డిజిటల్ క్రెడిట్‌ని పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ యొక్క CEO అయిన రాజేష్ బన్సాల్, డిజిటల్ SHG ఇనిషియేటివ్‌ను స్థాపించారు. బన్సాల్ కెనరా బ్యాంక్ MD మరియు CEO, K. సత్యనారాయణ రాజుతో డిజిటల్ SHG శ్వేతపత్రాన్ని పంచుకున్నారు.
గత సంవత్సరంలో PSU బ్యాంక్ ఇండెక్స్ 96% పెరిగింది. ఈ సమయంలో, కెనరా బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ 100% పైగా పెరిగాయి. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు కెనరా బ్యాంక్‌కు ‘బై’ రేటింగ్ మరియు రూ.600 టార్గెట్ ధరను కేటాయించాయి. కెనరా బ్యాంక్ స్టాక్ ధర ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ.608 వద్ద ట్రేడవుతోంది. గురువారం మార్కెట్ సెషన్‌లో కెనరా బ్యాంక్ షేరు రూ.608.70 వద్ద ముగిసింది.