సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డి’ పేరుతోగల ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 2020లో ఈ పథకం ప్రారంభించబడింది అయితే ఈ పధకం ఇప్పుడు 10 జనవరి, 2024 వరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ పొడిగింపు సీనియర్ సిటిజన్లకు వారి ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీ రేట్ల నుండి లబ్ధి పొందే అవకాశాన్ని అందిస్తుంది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కింద, సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్స్ కి 0.25 శాతం అదనంగా వడ్డీ రేటును అందిస్తారు, ఇది మామూలుగా సీనియర్ డిపాజిటర్లకు ఇచ్చే 0.50 శాతం ప్రీమియం కంటే అధికంగా ఉంటుంది. అంటే, ఈ ప్రత్యేక ప్లాన్ కింద, సీనియర్ సిటిజన్లు సాధారణ కష్టమర్ల కంటే 0.75 శాతం అధిక మొత్తం వడ్డీ అదనంగా పొందుతారు.
5 సంవత్సరాల టెన్యూర్ కి సాధారణ సీనియర్ సిటిజన్ FD రేటు 7.50 శాతంతో చూస్తే, బ్యాంక్ ఇప్పుడు ఈ ప్లాన్ కింద 7.75 శాతం వడ్డీ రేటు (Interest rate) ను అందజేస్తుందని నివేదిక పేర్కొంది. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ రేటు వర్తిస్తుందని తెలుసుకోవడం ముఖ్యం, ఫిక్స్డ్ డిపాజిట్ ల పదవీ కాలం 5 సంవత్సరాలు మరియు ఒక రోజు నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
HDFC బ్యాంక్ నుండి సీనియర్ సిటిజన్ కేర్ FD ముందస్తు ఉపసంహరణ పరంగా HDFC బ్యాంక్ పాలసీ చాలా ప్రత్యేకమైనది. స్వీప్-ఇన్ లేదా పాక్షికంగా మూసివేయబడిన సందర్భాలతో సహా, ఈ ఆఫర్ కింద బుక్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ 5 సంవత్సరాల తర్వాత ముందస్తుగా (In advance) మూసివేయబడితే, వర్తించే వడ్డీ రేటు డిపాజిట్ బుకింగ్ రేటు కంటే 1.25 శాతం తక్కువగా ఉంటుంది. బ్యాంకు సవరించిన ఈ రేటు డిపాజిట్ ఉన్న వాస్తవ కాలానికి వర్తిస్తుంది, ప్రారంభంలో ఒప్పందం (Agreement) కుదుర్చుకున్న రేటుకు కాదు.
మొత్తంమీద, HDFC బ్యాంక్ యొక్క సీనియర్ సిటిజన్ FD రేట్లు 3.50 శాతం నుండి 7.75 శాతానికి మారుతూ ఉంటాయి, 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు విస్తృత శ్రేణి (A wide range) పదవీకాలాన్ని కవర్ చేస్తుంది.