Latest FD Interest Rates 2023 : వివిధ బ్యాంక్ లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై తాజా వడ్డీ రేట్లు: BOB, BOI మరియు SBI లను పోల్చి చూడండి.

Latest FD Interest Rates 2023 : Compare the latest interest rates on fixed deposits in different banks: BOB, BOI and SBI.
Image Credit : The Economics Times- India Times

నేటి అస్థిర ఆర్థిక వాతావరణంలో, మీ డబ్బును ఆదాచేయడంలో సురక్షితమైన (safe) పొదుపులు మరియు వృద్ధి చేయడం  కీలకం. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) లో ఇన్వెస్ట్ చేయడం అనేది నిరూపితమైన విధానం. FDలు మీ డబ్బును రక్షిస్తాయి మరియు నిర్దిష్ట సమయంలో అధిక వడ్డీ రేటును అందిస్తాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరిచేటప్పుడు, మీరు ఒకసారి డబ్బును డిపాజిట్ చేయండి. బ్యాంక్, డిపాజిట్ మొత్తం మరియు పదవీకాలాన్ని (Tenure) బట్టి మారే వడ్డీ రేట్లు మీ పెట్టుబడి పై రాబడి (రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI) ని బాగా ప్రభావితం చేస్తాయి.

ఫిక్సెడ్ డిపాజిట్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటాయి. వ్యవధి (duration) ముగిసే సమయంలో వచ్చిన వడ్డీ అసలు మొత్తంని బేరీజు వేసుకుని లెక్క కట్ట బడుతుంది. ఈ సమయం ముగిసే సమయానికి డిపాజిటర్ వడ్డీతో పాటు డబ్బును అందుకుంటారు.

Also Read :Yes Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన యెస్ బ్యాంక్. పెంచిన వడ్డీ రేట్లను తెలుసుకోండి , ఇతర బ్యాంక్ లతో సరిపోల్చుకోండి.

నవంబర్ 30, 2023 నాటికి వివిధ కాలాల (different periods) కోసం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంక్ (A public sector bank) లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

Latest FD Interest Rates 2023 : Compare the latest interest rates on fixed deposits in different banks: BOB, BOI and SBI.
Image Credit : Money Control

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఫిక్స్‌డ్ డిపాజిట్ ల మీద ప్రస్తుత వడ్డీ (FD) రేట్లు 2023

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 1 సంవత్సర కాల వ్యవధి ఉన్న FD కి 7.25 శాతం, 5 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పై  7.25 శాతం మరియు 3 సంవత్సరాల నిర్ణీత సమయం కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ల మీద 6.75 శాతం అత్యధిక వడ్డీ రేట్లు (Interest rates) ఇస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) FD ల మీద తాజా వడ్డీ రేట్లు 2023

బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక స్లాబ్‌లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, 1-సంవత్సరం కాలానికి 6.50 శాతం, 3-సంవత్సరాల కాలానికి 6.50 శాతం మరియు 5-సంవత్సరాల కాలానికి 6 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.

Also Read : Tax Saving Fixed Deposits : ఆదాయ పన్ను తగ్గించే ఫిక్సెడ్ డిపాజిట్ లు. SBI, HDFC బ్యాంక్, ICICI ఇంకా ఇతర బ్యాంక్ లలో అత్యధికంగా వడ్డీ రేటు ని ఇచ్చేది ఏదో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) FD ల పైన తాజా వడ్డీ రేట్లు 2023

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక స్లాబ్‌లకు 7.1 శాతం వడ్డీ రేటు ను, 1-సంవత్సరం కాలానికి 6.8 శాతం, 3-సంవత్సరాల కాలానికి 6.5 శాతం మరియు 5 సంవత్సరాల కాలానికి 6.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in