Low House Interest Rates: తక్కువ వడ్డీకే గృహ రుణాలు, రూ.75 లక్షల లోన్ కి ఈఎంఐ ఎంతంటే?

ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీ రుణాలను అందిస్తున్నాయి, వీటిలో రూ. 75 లక్షల గృహ రుణాలు కూడా పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే.

Low House Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గృహ రుణ EMIలను ప్రభావితం చేసే రెపో రేటుకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు యాక్సిస్ వంటి ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీ రుణాలను అందిస్తున్నాయి, వీటిలో రూ. 75 లక్షల గృహ రుణాలు కూడా పొందవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :

SBI 8.50 శాతం నుండి 9.85 శాతం వరకు రూ. 75 లక్షలు రుణాలు అందిస్తుంది. అంటే మీ 20 సంవత్సరాల హోమ్ లోన్ EMI రూ. 65,087 నుండి రూ. 71,633 వరకు ఉండవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ :

యాక్సిస్ బ్యాంక్, రూ. 75 లక్షల రుణానికి 8.75 శాతం నుంచి 13.30 శాతం వడ్డీ రేటుకి రూ.75 లక్షలు రుణాలను అందజేస్తుంది. అంటే, 20 సంవత్సరాల రుణానికి EMI రూ. 66.278 మరియు రూ. 89,476 ఉండవచ్చు.

ICICI బ్యాంక్ :

ఐసిఐసిఐ బ్యాంక్, ఇప్పుడు 8.75 శాతం వడ్డీ రేటతో ప్రారంభమవుతుంది. అయితే, రూ. 75 లక్షల గృహ రుణం పొందవచ్చు. అంటే, 20 ఏళ్ల రుణానికి కనీసం EMIలలోరూ. 66,278 ఉండవచ్చు.

Also Read: Bank Jobs: వేలల్లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత ఉంటే చాలు, జాబ్ పక్కా!

కెనరా బ్యాంక్ :

కెనరా బ్యాంక్ 8.45 శాతం నుండి 11.25 శాతం వడ్డీ రేటు (Interest Rate) కి రూ.75 లక్షలు రుణాలను అందజేస్తుంది. 20 సంవత్సరాల గృహ రుణ EMI రూ. 64,850 నుండి రూ. 78,694 వరకు ఉండవచ్చు.

HDFC బ్యాంక్ :

భారతదేశంలో అతిపెద్ద రుణదాత HDFC బ్యాంక్, గృహ రుణ వడ్డీ రేటును 8.75 శాతంగా నిర్ణయించింది. దీంతో, 20 సంవత్సరాల రుణానికి కనీస EMI రూ. 66,278 ఉండవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ :

పంజాబ్ నేషనల్ బ్యాంక్, 8.40 శాతం నుండి 10.15 శాతం వడ్డీ రేట్లుకి రూ. 75 లక్షల రుణాలు అందిస్తుంది. అంటే, మీ 20 సంవత్సరాల రుణం కోసం, మీ EMI రూ. 64,613 నుండి రూ. 73,124 ఉండవచ్చు.

Comments are closed.