Telugu mirror : మహిళలకు ఆర్ధిక సుస్థిరత కల్పించే దిశగా తీసుకు వచ్చిన సేవింగ్స్ పధకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ పధకం. ఈ పధకం భారత దేశంలోని మహిళకు సుస్థిర ఆర్ధిక తోడ్పాటును ఇచ్చేందుకు ప్రభుత్వ సహకారం తో ఏర్పాటు చేయబడిన పొదుపు పధకం. వయస్సుతో సంభందం లేకుండా స్త్రీ లేదా అమ్మాయి వారి పేరు మీద ఈ వన్ – టైమ్ సేవింగ్స్ స్కీం పధకం లో పొదుపు ఖాతా ఓపెన్ చేయవచ్చు..
మహిళా పొదుపు పధకం పై వచ్చిన రాబడి ఎలా లెక్కించబడుతుంది:
మహిళా సమ్మాన్ సేవింగ్స్ పధకం పై పొందిన వడ్డీ పధకం కాల పరిమితి ముగిసిన తరువాత చెల్లించ బడుతుంది.అయితే వడ్డీ క్వార్టర్లీ లెక్కలలో కలిపి ఉంటుంది.ఈ పధకం లో పెట్టుబడి పై రాబడి సాధారణ వడ్డీ రేటు సూత్రాన్ని అనుసరించి లెక్కించబడుతుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం సర్టిఫికెట్లపై వచ్చే ఆదాయాన్ని వారం వారీగా లెక్కించబడుతుంది.మరియు పెట్టుబడి పెట్టిన డబ్బుతో పాటు (ఫిక్సడ్ డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ప్రోగ్రామ్ విధానాల వలే)కలిపి లెక్క చేయబడుతుంది,అని My Fund Bazaar CEO మరియు వ్యవస్థాపకుడు వినిత్ ఖండారే వివరించారు.
Panchang : నేటి పంచాంగం.. 03 జూలై 2023 వివరాలు తెలుసుకోండి..
సాధారణ వడ్డీ సూత్రం ద్వారానే సంపాదించిన వడ్డీ రాబడిని లెక్కిస్తారని,ఇది పెట్టుబడి పెట్టిన మొత్తం,దానికి ఇచ్చే వడ్డీ రేటు,పెట్టుబడి కలిగి ఉన్న కాలాన్ని గుణించటం ద్వారా రాబడిని కలిగి ఉంటుంది అని,SAG ఇన్ఫోటెక్ MD అమిత్ గుప్తా అన్నారు.ఉదాహరణకి.మీరు రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి నారు అనుకోండి.ఫస్ట్ క్వార్టర్లీ తరువాత మీరు రూ.3,750 వడ్డీని పొందుతారు.ఈ వడ్డీ మొత్తాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం ద్వారా రెండవ త్రైమాసికం చివరి వరకు రూ.3,820 వడ్డీ లభిస్తుంది.ఈ లెక్కన బాండ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు రూ.32,044 ను పొందుతారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం వడ్డీరేటు:
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీరేటు 2023 నుండి 2025 మద్యన ,రెండు సంవత్సరాల పరిమిత కాలానికి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అందించబడుతుంది.ఇది రెండు సంవత్సరాలకు స్థిరంగా వడ్డీ రేట్ ని కలిగిఉంటుంది.రెండేళ్ళ కాలానికి మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్ మీద 7.5% వడ్డీ రేట్ ని అందిస్తుంది.
Smart Phone : ఒకనాడు మానవ సంబంధాలు ..ఈనాడు స్మార్ట్ ఫోన్ సంబంధాలు..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం నుండి వచ్చే వడ్డీ పై TDS వర్తిస్తుందా?
ఈ పథకం పై వచ్చే వడ్డీపై ఎటువంటి పన్ను రాయితీ లభించదు అని 16 may 2023 న Central Board Of Direct Taxes (CBDT ) విడుదల చేసిన నోటిఫికేషన్ లో వెల్లడించింది. సెక్షన్ 194A క్రింద ఆర్ధిక సంవత్సరం లో ఈ పధకం కింద వడ్డీ రాబడి 40,000 దాటితే TDS అమలు పరుస్తుంది.ఆర్ధిక స్థిరత్వంతో మహిళలు ఎదగాలనే ఆలోచనతో. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ పధకాన్ని 2023-24 బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు.
ఏ బ్యాంక్ లలో ఈ పథకం లో చేరవచ్చు:
ఈ పథకానికి మహిళలలో పెరుగుతున్న ఆదరణని చూసి ప్రభుత్వం ఇటీవలనే నిభంధనను మార్చి,ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ రంగ బ్యాంకులైన ICICI,AXIS ,HDFC మరియు IDBI బ్యాంక్ లలో కూడా ఈ ఖాతా ను తెరవవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎవరిని పరిగణించాలి?
ఈ పథకంలో మహిళలు అందరూ వయస్సు మరియు వృత్తి తో సంభందం లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధకంలో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు.తరువాత రూ.100 గుణకారాలలో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా రూ. 2 లక్షల పెట్టుబడి వరకే పరిమిత కలిగి వుంది. ప్రభుత్వ హామీని కలిగి ఉండటం వలన సురక్షితమైన పొదుపుకు మంచి వేదిక.తక్కువ రిస్క్ ఇన్వెస్ట్ మెంట్ ల ద్వారా ఆకర్షణీయమైన రాబడిని కోరుకునే మహిళలకు మంచి మార్గం ఈ మహిళా సమ్మాన్ స్కీమ్.ఈ పొదుపు సర్టిఫికెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా,ఒక స్థిరమైన రాబడి వలన కలిగే మంచి ఆదాయాన్ని మహిళలు పొందుతారు.అలాగే ప్రభుత్వ మద్దతు గల పధకానికి వర్తించే అన్ని ప్రయోజనాలను పొందగలరు.