బ్యాంకుల RDs vs పోస్ట్ ఆఫీస్ RDs: ఏది అధిక వడ్డీ రేటును అందిస్తోంది…

Telugu Mirror : 2023 జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్ ను కేంద్ర ప్రభుత్వం 30 బేసిస్ పాయింట్లను పెంచడం ద్వారా 6.5 శాతానికి పెంచింది. రికరింగ్ డిపాజిట్ లపై లభించే వడ్డీ రేట్లు బ్యాంక్ లను బట్టి వివిధ రకాలుగా మారుతుంటాయి.ఈ కధనంలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ల మీద వడ్డీ రేట్లు,మరియు ప్రముఖ బ్యాంక్ లలో లభించే వడ్డీ రేట్ల గురించి తెలుసు కుందాం.RD లలో పెట్టుబడి పెడితే మీకు ఎక్కడ ఎక్కువ లాభం చేకూరుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పోస్ట్ ఆఫీస్ RD:
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ యొక్క కాల పరిమితి డిపాజిట్ చేసిన రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అకౌంట్ తెరచిన నాటి నుంచి డిపాజిట్ కాలపరిమితి ముగిసే సమయం వరకు ఒకే వడ్డీ రేటుని ఇస్తారు. ఈ త్రైమాసికంలో వడ్డీ రేటు 6.5 గా చెల్లిస్తారు.

Jio Book: జియో బంపర్ ఆఫర్.. మరో కొత్త ల్యాప్‌టాప్ రూ. 20 వేలలోపే..

SBI వడ్డీ రేట్ RD లపై:
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో SBI రికరింగ్ డిపాజిట్ లమీద1సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు కాలవ్యవధి కలిగి ఉన్న ఆర్డీలపై 5.10
శాతం వడ్డీని SBI చెల్లిస్తుంది.2నుండి 3 సంవత్సరాల లోపు కాలానికి వడ్డీ రేటు 5.20 శాతం వస్తుంది. 3 నుండి 5 సంవత్సరాలలోపు కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై బ్యాంక్ 5.45.శాతం వడ్డీని అందిస్తుంది.5 నుండి పది సంవత్సరాల వరకు ఎక్కువ కాలం పాటు ఉన్న రికరింగ్ డిపాజిట్ ల మీద SBI 5.50 ఇంట్రెస్ట్ ను ఇస్తుంది. SBI లో కనీస డిపాజిట్ కాలవ్యవధి 12 నెలలు, గరిష్ట డిపాజిట్ వ్యవధి 120 నెలలు.

ICICI బ్యాంక్ వడ్డీ రేట్లు, RDల మీద :
ఐసిఐసిఐ బ్యాంక్ సామాన్య పౌరులకు RD లపై 4.75 శాతం నుంచి 7.10 శాతం వడ్డీని అందిస్తుంది.అదేవిధంగా సీనియర్ సిటిజన్ లకు 5.25 శాతం నుండి 7.50 పర్సెంట్ వరకు వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 24,2023 నుండి అమల్లోకి వచ్చాయి.

HDFC బ్యాంక్ RD లపై అందించే వడ్డీ:
HDFC బ్యాంక్ 6 నెలల కాల పరిమితికి 4.50 శాతం వడ్డీని అందిస్తుంది.9 నెలలకు 5.75 శాతం,12 నెలలకు 6.60 శాతం మరియు15 నెలల కాలానికి 7.10 శాతం వడ్డీని అందిస్తుంది. HDFC బ్యాంక్ నుండి 24 నెలలు,27 నెలలు,36నెలలు, అలాగే 39నెలలు, 48నెలలు, 60నెలలు, 90నెలలు మరియు120 నెలల కాలవ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్ ల మీద 7 శాతం వడ్డీ రేట్ లభిస్తుంది.

ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు మంగళవారం , జూలై 25, 2023 తిథి ,పంచాంగం

YES బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ:
Yes బ్యాంక్ 6 నెలల కాలం నుండి 5 సంవత్సరాల కాల పరిమితి కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న డిపాజిట్ లకు 6.10 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.ఇందులో రికరింగ్ డిపాజిట్ లకోసం 3 నెలల బహుళ కాలానికి అనగా 6నెలలు,9నెలలు లేదా12 నెలల వ్యవధిలో బుక్ చేసుకునే అవకాశం ఉంది.అయితే వాయిదాలను చెల్లించకుంటే 1శాతం జరిమానా విధించబడుతుంది.

Leave A Reply

Your email address will not be published.