Telugu Mirror : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా స్టార్ గుర్తుతో ఉన్న రూ.500 నోట్ల చలామణికి సంభంధించిన అప్ డేట్ ను అందించింది. దేశవ్యాప్తంగా 500 డినామినేషన్ కు చెందిన అసలు మరియు నకిలీ నోట్లు(Duplicate Notes) రెండ రెండూ చెలామణిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా RBI వీటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.రూ.2,000 కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి లోనుండి ఉపసహరించుకున్న తరువాత, ఈ నోట్ల వ్యవహారంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 29-జూలై-2023
నోట్ల రద్దు పరిస్థితి తర్వాత కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో రకరకాల పుకార్లు(Rumors) ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ ప్రత్యేకంగా స్టార్ గుర్తు ఉన్న నకిలీ 500 రూపాయల నోట్ల గురించి వెలువడిన పుకార్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.అయితే ఈ నోట్ల చలామణి గురించి ఉన్నటువంటి ఆందోళనలను తొలగించే విధంగా RBI ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నోట్ల అంకెల ప్యానెల్(Panel) లో స్టార్ గుర్తులు కలిగి ఉన్న నోట్లు, నిజానికి నక్షత్రం గుర్తులేని ఇతర నోట్ల వలే చలామణి అవుతాయి.
నోట్లపై స్టార్ గుర్తు(*) యొక్క ఉద్దేశం ఏమిటంటే దెబ్బతిన్న నోట్లను భర్తీ చేయడం లేదా తిరిగి ఆ నోటు ముద్రించబడిందని సూచించడానికి చిహ్నమే యాష్ట్రిస్క్ (అనగా *గుర్తు) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దెబ్బతిన్న నోట్లను రిప్లేస్మెంట్(Replacement) లేదా తిరిగి ప్రింటింగ్ చేసినప్పుడు దానిని సూచించడానికి అదే నంబరు మరియు సవరించినప్పుడు ఒక స్టార్ ని జత చేస్తుంది.నంబర్ సిరీస్ లో స్టార్ గుర్తు ఉన్న నోటు కనిపిస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదని ప్రజలు తెలుసుకోవడం ముఖ్యం. ఈ నోట్లు నిజమైనవని,వీటిని ఎటువంటి అనుమానం లేకుండా అన్ని లావాదేవీలకు(Transaction) వినియోగించవచ్చు.
నక్షత్రం గుర్తుతో ఉన్న నోట్ల చెల్లుబాటుపై సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న వివిధ చర్చలు మరియు పుకార్లను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరణను వెలువరించింది. బ్యాంకు నోట్ల నంబర్ సిరీస్(Number Series) లో స్టార్ గుర్తును జత చేయడం ద్వారా అసలైన నోట్లు మరియు దెబ్బతిన్న కారణంగా రీ ప్రింటింగ్ ద్వారా భర్తీ చేసిన నోటుకు తేడాను గుర్తించడం ఆర్బీఐ లక్ష్యం.
స్టార్ గుర్తుతో ఉన్న నోట్లను 100 ముక్కలుగా ప్రింటింగ్(Printing) చేయడం గమనించవలసిన విషయం. ఒక్కొక్క నోటు ప్రత్యేకమైన ఒకే సిరీస్ లోనే క్రమ సంఖ్యను కలిగి ఉంటాయి దాని వలన మీకు స్టార్ గుర్తు ఉన్న 500 రూపాయల నోటు కనిపిస్తే అది చలామణి లో ఉన్నదని మరియు చట్టబద్ధత కలిగి ఉన్నదని గుర్తించి ఏ సమస్య లేకుండా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలలో ఉపయోగించవచ్చని ఆర్బిఐ(RBI) తెలియపరచింది.