ప్రతి ఒక్కరూ సబ్బు, బాడీ వాష్ లేదా షవర్ జెల్ వీటిలో ఏదో ఒకటి ఉపయోగించి స్నానం చేస్తుంటారు. అయితే చర్మాన్ని శుభ్రపరచడానికి (clean) ఇదొక్కటే సరిపోదు. ఇకనుండి దీనిని కూడా ప్రయత్నించండి తేడా మీకే తెలుస్తుంది.
ఈరోజు కథనంలో బాత్ సాల్ట్ (ఎప్సం సాల్ట్) ను ఉపయోగించి స్నానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
స్నానం చేసే నీటిలో ఉప్పు కలుపుకొని స్నానం చేయవచ్చు. లవణాలతో (with salts) ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్నానం చేసే నీటిలో బాత్ సాల్ట్ ను కలపడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు అవుతుంది. తద్వారా జీవన శైలి కూడా మెరుగు పడుతుంది.
బాత్ సాల్ట్ వివిధ రకాల ఖనిజాలను (Minerals) కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. బాత్ సాల్ట్ చర్మం లోని తేమను నిర్వహించడానికి మరియు చర్మంపై అధికంగా ఉన్న ఆయిల్ ను నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
బాత్ సాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం ఎక్స్ ఫోలియేట్ అవుతుంది. చర్మం పై ఉన్న మృత కణాల (Dead cells) ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాని మృదువుగా మరియు మెరిసేలా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.
బాత్ సాల్ట్ చర్మంపై పేరుకుపోయిన మురికిని చాలా బాగా శుభ్రం చేస్తుంది. నిర్వీషీకరణ (detoxification) చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మం యొక్క స్థితి స్థాపకత (Stability) ను తిరిగి పొందడంలో ఎంతగానో సహాయపడుతుంది.
Also Read : Effects Of Hard Water : ఉప్పునీటితో తల స్నానం చేస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కోవలసిందే?
బాత్ సాల్ట్ ను ఉపయోగించి స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండటం వల్ల వ్యాధులు (Diseases) రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. బాత్ సాల్ట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది చర్మం ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బాత్ సాల్ట్ ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల ఒత్తిడి (stress) తగ్గుతుంది. శరీరానికి మరియు మనసుకు ప్రశాంతంగా మరియు హాయిగా ఉంచడంలో తోడ్పడుతుంది. కాబట్టి అలసిపోయినప్పుడు బాత్ సాల్ట్ ను ఉపయోగించి స్నానం చేస్తే మంచి రిలాక్స్ గా ఉంటుంది.
Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం
రాత్రి పడుకునే ముందు బాత్ సాల్ట్ తో స్నానం చేయడం వలన ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ హార్మోన్ స్రావానికి సహాయపడుతుంది. బాత్ సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వలన నిద్రలేమి (Insomnia) సమస్య కూడా తగ్గిపోతుంది.
కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మరియు నిగారింపు చర్మం ను పొందాలనుకునేవారు స్నానం చేసే నీటిలో బాత్ సాల్ట్ కలుపుకొని స్నానంచేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.