సాధారణంగా చామంతి పూలను పూజ చేసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా ఈ పూలను లక్ష్మీదేవి పూజకు వాడుతుంటారు. అలాగే పండుగల సమయంలో ఇంట్లో అలంకరణ (decoration) చేయడానికి కూడా చామంతి పూలను ఉపయోగిస్తాము. అందుకే చాలా మంది చామంతి పూల మొక్కలను పెంచుతుంటారు. అయితే చామంతి పూలను పూజకు మాత్రమే కాదు, వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు.
చామంతి (chrysanthemum) పూలతో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు మరియు జ్వరం తగ్గడానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. చామంతి పూలతో డయాబెటిస్ ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
చామంతి పూలను ఏ విధంగా ఉపయోగించడం వలన ఎటువంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం:
కీళ్ల నొప్పులు:
కీళ్ల నొప్పులతో బాధపడేవారు చామంతి పూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల కీళ్ల నొప్పుల (Joint pain) ను కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.
Also Read : Amla Juice : ఉసిరి రసం ఇలా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
జ్వరం:
జ్వరం వచ్చినప్పుడు రకరకాల మందులు వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా చామంతి పూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల జ్వరం నుంచి త్వరగా ఉపశమనం (relief) లభిస్తుంది.
ఒత్తిడి:
ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆందోళన (worry) గా అనిపించినప్పుడు చామంతి పూలతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన నుంచి రిలీఫ్ పొందవచ్చు.
నిద్రలేమి:
చాలా మంది నిద్రలేమి (Insomnia) సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర బాగా పట్టాలంటే చామంతి పూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పట్టాలి అంటే ఫ్రిజ్ లో ఉన్న చామంతి పూలను కనురెప్పలపై ఉంచితే మంచి రిలీఫ్ కూడా లభిస్తుంది.
Also Read : Black Pepper : మిరియాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
చర్మం:
చామంతి పూలతో చేసిన టీ ని ముఖము మరియు కాళ్లు, చేతులపై రాసుకోవడం వల్ల చర్మం (skin) మెరుస్తూ ఉంటుంది. చర్మాన్ని శుభ్రపరిచి, ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. దోమ కుట్టినప్పుడు వచ్చే దద్దుర్లు, మచ్చలు, గాయాలు వల్ల వచ్చే మచ్చలు త్వరగా పోవాలంటే చామంతి పూల టీ ని వాటిపై రాస్తే తగ్గిపోతాయి.
తలనొప్పి:
ఒక్కొక్కసారి కొంతమందికి సడన్ గా తలనొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు వారు చామంతి పూలను నెయ్యి (ghee) లో లైట్ గా వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వాటిని నుదిటి పై పెట్టి కట్టాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి చామంతి పూలను ఉపయోగించి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక: ఈ కధనం లోని అంశాలను పాఠకులకు జ్ఞానం, అవగాహన కలిగించడం కోసం అందించడం జరిగినది. కధనం లోని అంశాలను ఉపయోగించే ముందు నిపుణులను సంప్రదించండి.