Telugu Mirror: ప్రతి ఒక్కరు తాము అందంగా ఉండాలని కోరుకోవడం సహజం. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. స్కిన్ కేర్ లో భాగంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ప్రస్తుత రోజుల్లో సన్ స్క్రీన్ (Sunscreen) కూడా స్కిన్ కేర్ (Skin Care) లో ఒక భాగం అయినది. బలమైన సూర్యకాంతి కిరణాలు అధికంగా ఉండటం వలన సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా చర్మం పై అప్లై చేయాల్సి వస్తుంది.
సీజన్ ఏదైనా సన్ స్క్రీన్ ఉపయోగించడం వలన చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ ప్రతిరోజూ బయటకు వెళ్లేటప్పుడు రాసుకోవడం వల్ల చర్మాన్ని రక్షించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అయితే ప్రతిరోజు సన్ స్క్రీన్ అప్లై చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సన్ స్క్రీన్ వాడకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.
ఈరోజు కథనంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉండదో తెలుసుకుందాం.
Also Read : Health Tips : స్వంతంగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ముఖ్యంగా పారాసెటమాల్ అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే
గ్రీన్ టీ (Green Tea):
ఈ మధ్యకాలంలో గ్రీన్ టీ ను అధికంగా తీసుకుంటున్నారు. గ్రీన్ టీలో రెసిపెరిట్రాల్ అనే పదార్థం ఉండడం వలన ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియాను మరియు వ్యర్ధాలను బయటకు పంపి అలర్జీ లతో పోరాడుతుంది. తద్వారా చర్మం ను కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
నిమ్మరసం (Lemon Water):
నిమ్మరసంలో విటమిన్ -సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి హానికరమైన సూర్యకాంతి కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా నిమ్మరసం కాపాడుతుంది.
మజ్జిగ (Lassi) :
మజ్జిగలో క్యాల్షియం, సోడియం, ప్రోటీన్స్, మినరల్స్ వంటివి అధికంగా ఉంటాయి. మజ్జిగ త్రాగడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. దీనితో పాటు జీవక్రియ రేటు పెంచి శరీరంలో నిల్వ ఉన్న వ్యర్ధ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం పై ఉన్న ముడతలు, ఫైన్ లైన్ లను నివారించడంలో మజ్జిగ చాలా బాగా సహాయపడతాయి.
Also Read : శరీరానికి పోషకాలే కాదు ‘చర్మ సమస్యలను సైతం ఖతం’ చేసే పాలకూర.. అందుకే ఇది సూపర్ ఫుడ్
టమాట (Tomato) :
చర్మంపై ఉన్నటువంటి టాన్ ను తొలగించడంలో టమాటా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సన్ బర్న్ ప్రమాదాల నుండి నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సూర్యకిరణాలు నుండి చర్మాన్ని కాపాడతాయి.
కొబ్బరి నీళ్లు (Coconut Water) :
కొబ్బరి నీళ్లు చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. తరచుగా కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉంచి, శరీరంలోని మలినాలను తొలగించి చర్మ కాంతి ని మెరుగుపరచడంలో కొబ్బరినీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
కాబట్టి ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రతిరోజు సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకనగా ఈ ఆహార పదార్థాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.