Beauty Tips : నిర్జీవంగా ఉన్న మీ ముఖ చర్మాన్ని నిమిషాల్లో మెరిపించే మ్యాజికల్ రెమిడీ
కొంతమందికి అప్పుడప్పుడు ముఖ చర్మం డల్ గా మారుతుంటుంది. బ్రైట్ నెస్ తగ్గిపోయి ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అటువంటి వారి కోసం15 నిమిషాల్లో ఫెయిర్ స్కిన్ పొందే ఇంటి చిట్కా ను తెలియజేస్తున్నాం.
కొంతమందికి అప్పుడప్పుడు ముఖ చర్మం డల్ గా మారుతుంటుంది. బ్రైట్ నెస్ తగ్గిపోయి ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు బయటకు వెళ్లే మహిళలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ సమస్య నుండి బయటపడడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే కొంతమందికి వీటి వల్ల చర్మం (Skin) పై సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.
Also Read : Beauty Tips : కేశ రక్షణ, చర్మ సౌందర్యం రోజ్ మేరీ ఆయిల్.. కొనండి., వాడండి., ఫర్ ఫెక్ట్ ఫలితాన్ని చూడండి
అటువంటి వారి కోసం ఈ రోజు కథనంలో 15 నిమిషాల్లో ఫెయిర్ స్కిన్ పొందే ఇంటి చిట్కా (Home tip) ను తెలియజేస్తున్నాం. దీనికోసం పెద్దగా ఖర్చు (cost) మరియు శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు.
కేవలం ఇది ఫెయిర్ స్కిన్ కు మాత్రమే కాకుండా ముఖంపై ఉన్న ఇతర చర్మ సమస్యల (Other skin problems) ను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. బ్రైట్ స్కిన్ పొందడంతో పాటు ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో టమాట చాలా బాగా పనిచేస్తుంది.
టమోటాలను ఉపయోగించి కాంతివంతమైన చర్మంను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు :
బాగా పండిన టమాటాలు -రెండు. ఒక స్పూన్ -తేనె (Honey).
ఈ రెండింటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఐస్ క్యూబ్ మౌల్డ్ లో పోసి డీప్ ఫ్రిజ్లో (Fridge) పెట్టాలి. కొన్ని గంటల తర్వాత టమాటా ఐస్ క్యూబ్స్ తయారవుతాయి.
ఈ టొమాటో క్యూబ్స్ ముఖాని (Face) కి మరియు మెడ (Neck) కు అప్లై చేయాలి.అంతే కాకుండా, కాళ్లు, చేతులకు కూడా ఉపయోగించవచ్చు. ఈ క్యూబ్స్ తో ముఖంపై సున్నితంగా మర్దన చేయాలి.
రుద్దిన పది నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. దీనిని వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. మంచి ఫలితం కనబడుతుంది.ఈ టమాటో ఐస్ క్యూబ్ (Tomato Ice Cube) వాడిన 15 నిమిషాలలో ముఖంలో వచ్చే తేడాను మీరే గమనిస్తారు.
Also Read : Beauty Tips : చలికాలంలో చర్మ సమస్యల నుంచి రక్షించే నేచురల్ ఫేస్ ప్యాక్.
కాబట్టి ముఖం డల్ గా ఉన్నవారు మరియు చర్మం పై ఇతర సమస్యలు ఉన్నవారు కూడా ఈ మ్యాజికల్ టమాటో ఐస్ క్యూబ్ తో ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ (Glowing skin) ను సులభంగా పొందవచ్చు.
Comments are closed.