Black Spots On Fore Head : నుదిటిపై నల్ల మచ్చలను సులువుగా తొలగించే ఇంటి చిట్కాలు

Black Spots On Fore Head: Home Tips To Remove Black Spots On Forehead Easily
Image Credit : Health Line

ప్రస్తుత రోజుల్లో కాలుష్యం (Pollution) తో కూడిన వాతావరణం, ఎండ వల్ల కలిగే వేడితో టాన్ మరియు నల్ల మచ్చలు సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి సూర్యకాంతి కిరణాలు బలంగా ఉండడం వలన వివిధ రకాల చర్మ సమస్యలు వస్తున్నాయి.

ఈ సమస్యల నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సూర్యరశ్మి కారణంగా ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు, టాన్ కనిపించడం ప్రారంభమవుతాయి. వీటిని పోగొట్టుకోవడం అంత సులభం కాదు.

అటువంటి సందర్భంలో నుదుటిపై నల్లటి మచ్చల (Black spots) తో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి నుదుటిపై వచ్చే నల్లటి మచ్చలను తొలగించవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

సులువుగా ఇంట్లోనే కొన్నిఫేస్ ప్యాక్ లను తయారు చేసుకొని వాడినట్లయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
నుదుటి (forehead) పై వచ్చే నల్లని మచ్చలను ఎలా తొలగించు కోవాలో తెలుసుకుందాం.

Also Read : JADE ROLLER MASSAGER : మిడిల్ ఏజ్ లో కూడా టీనేజ్ లా మెరవాలంటే. ఉపయోగించండి, తేడా గమనించండి

నిమ్మ తొక్క :

నుదుటిపై మచ్చలు ఉన్నవారు నిమ్మతొక్కను నుదిటిపై రుద్దడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా పచ్చి పాల (raw milk) లో నిమ్మరసం కలిపి నుదుటిపై రాయాలి‌ ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ విధంగా చేసినా కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

Black Spots On Fore Head: Home Tips To Remove Black Spots On Forehead Easily
Image Credit : Telugu Mirror

బొగ్గు పొడి :

నుదుటి పై ఉన్న నల్లని మచ్చలను తొలగించడానికి బొగ్గు పొడి (Coal powder) ని కూడా వాడవచ్చు. బొగ్గు పొడిని పేస్ట్ లా చేసి ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత స్క్రబ్ తో శుభ్రం చేయాలి. దీనిని వారంలో రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించడం వలన చక్కటి ఫలితం ఉంటుంది.

Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం

ఓట్స్ :

ఓట్స్ ను నీటిలో నానబెట్టి, మజ్జిగ (buttermilk) వేసి కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను నుదుటిపై అప్లై చేసి మర్దనా చేయాలి. ఇది నుదుటిపై ఉన్న మచ్చలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

బంగాళదుంప :

పచ్చి బంగాళదుంప ను పేస్ట్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలు తొలగిపోతాయి. బంగాళదుంప పేస్ట్ చర్మానికి తేమ (moisture) ను కూడా అందిస్తుంది.

Also Read : Fenugreek Seeds Benefits : మెంతుల ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వాడండి తేడా చూడండి

పసుపు మరియు పెరుగు :

పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు ఉన్నాయి. పెరుగు చర్మాన్ని మృదువు (soft) గా చేయడంలో సహాయపడుతుంది. పెరుగు లో పసుపు వేసి కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్ ని నుదుటిపై అప్లై చేయాలి. దీనిని వారంలో మూడు సార్లు వాడవచ్చు. ఈ ప్యాక్ నుదుటిపై ఉన్న నల్లని మచ్చలను చాలా బాగా తొలగిస్తుంది.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతం గా చేస్తాయి. రాత్రిపూట ముఖంపై రోజ్ వాటర్ ను అప్లై చేయాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. దీనిని ప్రతిరోజు వాడవచ్చు. కొన్ని రోజులు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు అన్ని తగ్గి పోతాయి. రోజ్ వాటర్ ముఖం పై ఉన్న మచ్చలను తొలగించి, ముఖం తాజా (fresh) గా ఉండేలా చేస్తుంది.

కాబట్టి నుదుటిపై నల్లని మచ్చలు ఉన్నవారు ఈ ప్యాక్ లను తరచుగా వాడినట్లయితే వీటి నుండి సులువుగా బయటపడవచ్చు. ‌

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in