ప్రస్తుత బిజీ లైఫ్ (Busy life) మరియు కాలుష్యం (Polutaion) తో కూడిన వాతావరణం వల్ల ముఖం (Face) అలసట మరియు ఒత్తిడికి లోనవుతుంది. కొంతమందికి తరచుగా ముఖ చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అటువంటి సమయంలో చర్మం తిరిగి సహజ కాంతిని పొందడానికి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ (Face pack)లు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ లు వాడిన తర్వాత ముఖం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారుతుంది. మెరిసే చర్మం పొందడం కోసం ప్రతి ఒక్కరు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు.కొంతమంది పార్లర్ (Parlar) కి వెళ్లి తమ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఇంటి చిట్కాలు (Home remedies) అనుసరిస్తారు.
ఈరోజు చెప్పబోయే ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల నిర్జీవం (Dull) గా ఉన్న ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలను మరియు ముడతలను తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ ఫేస్ ప్యాక్ ఏమిటో తెలుసుకుందాం.
పాలు మరియు తేనె కలిపిన ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.
రాత్రి సమయంలో పడుకునే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి కాటన్ టవల్ తో తుడవాలి. ఒక గిన్నెలో ఒక స్పూన్ పచ్చిపాలు (Raw milk) మరియు ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి వేళ్ళ (Fingers) సహాయంతో సున్నితంగా మర్దన చేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆగి తర్వాత సాధారణ నీటితో కడగాలి. తర్వాత కాటన్ టవల్ (Cotton Towel) ని ఉపయోగించి శుభ్రంగా ముఖాన్ని తుడవాలి.ఆ తర్వాత ఏదైనా మంచి మాయిశ్చరైసర్ ని ముఖంపై అప్లై చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల చర్మం తేమగా, మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారం (Week) లో మూడు సార్లు ఉపయోగించవచ్చు.
ఈ ప్యాక్ ను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం:
పాలల్లో ఎమోలియెంట్ మరియు హైడ్రేటింగ్ లక్షణాలు ఉండటం వల్ల చర్మాని మృదువు (Smooth) గా చేయడంలో సహాయపడుతాయి.
Also Read : waxing :వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై మంట మరియు దురద ఉంటే ఇలా చేయండి రిలీఫ్ పొందండి.
ఫేస్ వాష్ వాడడం వలన ముఖంపై చెడు ప్రభావం ఉంటుందా ? తెలుసుకోండిలా.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ (Anti bacterial) లక్షణాలు ఉండటం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
పాలు మరియు తేనె కలిసిన మిశ్రమం చర్మాన్ని మాయిశ్చరైజర్ (Moisturizer) గా ఉంచి చర్మం మెరిసేలా చేస్తుంది.
పాలల్లో విటమిన్ లు ((Vitamins ) మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం లో వచ్చే ముడతలను నిరోధిస్తుంది.
తేనే మరియు పాల మిశ్రమం చర్మంపై ఉన్న మొటిమల తాలూకా మచ్చలను నిర్మూలించడంలో సహాయపడుతుంది.
ఛాయను మెరుగుపరచడంలో ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది.
ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటుంది.
కాబట్టి ముఖ చర్మం నిర్జీవంగా ఉన్నవారు, అలాగే ముఖంపై ముడతలు మరియు మొటిమలు, మచ్చలు ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ ను వాడటం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖాన్ని ఆరోగ్యంగా, అందంగా మరియు కాంతివంతంగా మార్చుకోవచ్చు.