మెంతులను ఎక్కువగా వంటలలో మరియు నిల్వ పచ్చళ్ళలో వాడుతుంటారు. అయితే మెంతులు (Fenugreek) చర్మానికి మరియు జుట్టుకు కూడా చాలా చక్కటి ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు చర్మాన్ని మరియు జుట్టును శుభ్ర పరచడంలో ఎంతగానో తోడ్పడతాయి.
మెంతుల పేస్ట్ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి మరియు జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా మెంతులు ముఖంపై ఉన్న మొటిమలను మరియు బ్లాక్ హెడ్స్ ని కూడా తొలగిస్తాయి.
చర్మంను క్లియర్ స్కిన్ టోన్ గా చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. తద్వారా ముడతలు తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. చర్మంను సంరక్షించడంలో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. మెంతులలో ఫైబర్, ఐరన్, రాగి, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ బి-6 వీటితో పాటుగా విటమిన్- సి, పొటాషియం కూడా ఉన్నాయి.
ఈరోజు కథనంలో నానబెట్టిన మెంతులను ఉపయోగించి తయారు చేసే ప్యాక్ లను వాడటం వల్ల ముఖంపై వచ్చే చర్మ సమస్యలను సులువుగా ఎలా పోగొట్టు కోవాలో తెలుసుకుందాం.
నానబెట్టిన మెంతులలో గోరువెచ్చని పాలు (Warm milk) కలిపి మిక్సీ పట్టి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ ముఖంపై వచ్చే ముడతలకు చక్కటి, సులువైన పరిష్కారం. మెంతులలో విటమిన్ -సి ఉంటుంది. కనుక ఈ ప్యాక్ ముఖాన్ని మెరిసేలా చేయడంతో పాటు, ముఖ చర్మం నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
మెంతులలో విటమిన్ సి మరియు పొటాషియం అలాగే ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని వేగవంతం చేయడంలో మెంతులు ఎంతగానో సహాయపడతాయి.
Also Read : Benefits Of Corn Flour : మీకు తెలుసా? మురికి, మరకలను కూడా వదిలించే మొక్కజొన్న పిండి
మెంతులను నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టాలి. వడకట్టిన నీటిని మొటిమలు (pimples) ఉన్నచోట ప్రతిరోజూ రాయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన మెంతులను పేస్టులా చేయాలి ఈ పేస్ట్ కి ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలపాలి. ఈ రెండిటిని బాగా కలిపి ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఈ విధంగా తరచుగా చేయడం వల్ల ముఖంపై ఉన్న టాక్సిన్స్ ను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం
మెంతులను నానబెట్టి వాటిని పేస్ట్ లా చేయాలి. ఈ పేస్టును ముఖంపై అప్లై చేసి మర్దనా చేయడం వల్ల సాగిపోయిన చర్మం బిగుతుగా చేస్తుంది. తరుచుగా ఈ విధంగా చేయడం వల్ల ముఖంపై ముడతలు (Wrinkles) తొలగిపోతాయి. ఈ ప్యాక్ కోల్పోయిన యవ్వన చర్మాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. ఈ ప్యాక్ ముడతలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కాబట్టి సాగిపోయిన చర్మం (Stretchy skin) ఉన్నవారు మరియు ముడతలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఇటువంటి సమస్యలు ఉన్నవారు కూడా మెంతుల పేస్టును ఉపయోగించి ముఖంపై వచ్చే చర్మ సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు. తద్వారా పట్టు లాంటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.