యాలుకలు ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటాయి. యాలుకలు (cardamoms) ఆహార పదార్థాలకు రుచిని మరియు సువాసనను అందిస్తాయి. వీటిని టీ వంటి పానీయాలలో కూడా ఉపయోగిస్తారు. అయితే యాలుకలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందుకే వీటిని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. యాలుకల రుచిని అందరూ ఇష్టపడతారు.
ఆహారంలో యాలుకలను వేయడం వలన ఆహారానికి మరింత రుచిని అందించడం వీటి ప్రత్యేకత. వీటిని సాధారణంగా స్వీట్స్, బిర్యాని వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. యాలకులలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాలకులు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
జీర్ణ క్రియ :
యాలకులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. యాలకులు తినడం వల్ల ఎంజైమ్ ల స్రావం (Secretion of enzymes) ప్రేరేపితమై జీర్ణక్రియకు సహాయపడతాయి. తద్వారా గ్యాస్, కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
తాజా శ్వాస :
సహజ మౌత్ ఫ్రెషనర్ గా యాలకులను ఉపయోగిస్తారు. వీటిని ప్రతిరోజు నమలడం వల్ల నోటి దుర్వాసన (Bad breath) పోతుంది. నోరు తాజాగా మారుతుంది. అలాగే తాజా సువాసన (Fresh fragrance) ను కూడా అందిస్తుంది. ఇదే కాకుండా వీటిని తరచుగా తినడం వల్ల దంత సమస్యలు కూడా తగ్గుతాయి.
రక్తప్రసరణ :
యాలకలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రక్తాన్ని సహజ సిద్ధంగా పల్చగా అయ్యేలా పని చేస్తుంది. దీనివల్ల సిరలలో (in the veins) రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read : Amla Juice : ఉసిరి రసం ఇలా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
డీటాక్సిఫికేషన్ :
శరీరంలో ఉన్న విషపూరిత (poisonous) పదార్థాలను డీటాక్స్పై చేస్తుంది. శరీరంలో విష పదార్థాలు పేరుకుని ఉంటే అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మూత్ర విసర్జన ద్వారా శరీరంలో ఉన్న వ్యర్ధపదార్థాలను తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. కిడ్నీకి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది.
Also Read : శృంగార సామర్ధ్యం పెరగాలంటే ఆహారంలో ఈ పండ్లను తీసుకోండి.
లైంగిక సమస్యలు :
పురుషులు కనీసం ప్రతిరోజు రెండు యాలకులు తినడం వల్ల వారిలో నపుంసకత్వం (impotence) దూరం అవుతుంది. యాలకులు లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి యాలుకలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.