చలికాలంలో (Winter) మార్కెట్లో వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లు విరివిగా లభిస్తాయి. అయితే శీతాకాలంలో ముఖ్యంగా తినాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసినట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
శీతాకాలంలో తినవలసిన కూరగాయలలో పుట్టగొడుగులు (Mushrooms) ఒకటి. పుట్టగొడుగులు తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో క్రమం తప్పకుండా పుట్టగొడుగులను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుట్టగొడుగులలో అమైనో యాసిడ్స్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో విటమిన్ -డD, B2, B3, కూడా ఉన్నాయి.
విటమిన్ – D లోపంతో బాధపడేవారు ప్రతిరోజు పుట్టగొడుగులను తినడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పుట్ట గొడుగులలో డీ- ఫ్రాక్షన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ (Immune system) కు సపోర్ట్ ను ఇస్తుంది. వ్యాధులు కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఎముకలు (Bones) ఆరోగ్యంగా ఉండడానికి కూడా పుట్టగొడుగులు చాలా మేలు చేస్తాయి. పుట్టగొడుగులలో అమైనో ఆమ్లం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన సెల్యులార్ డ్యామేజ్ లను నివారిస్తాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి.
పుట్ట గొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని చలికాలం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ – D కి మంచి మూలంగా చెప్పబడిన ఆహారం.
పుట్ట గొడుగులలో సోడియం మోతాదు తక్కువగా మరియు పొటాషియం మోతాదు అధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ ని నియంత్రణలో ఉంచుతుంది. పుట్ట గొడుగు లకు చెడు కొలెస్ట్రా ల్(bad cholesterol) ను తగ్గించే శక్తి కూడా ఉంది.
వీటిల్లో పీచు పదార్థం (Fibrous matter), పొటాషియం, విటమిన్ లు సమృద్ధిగా ఉన్నాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది.
పుట్టగొడుగులు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
పుట్ట గొడుగులలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక మధుమేహంతో (diabetes) బాధపడుతున్న వారు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఇవి గట్ బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి మరియు గట్ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
కాబట్టి శీతాకాలంలో క్రమం తప్పకుండా తీసుకొనే కూరగాయలలో పుట్టగొడుగులు ఒకటి. వీటిని తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక : ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన కల్పించడం కోసం తయారు చేయబడింది. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించండి.